Kolkata Drones: కోల్‌కతాలోకి డ్రోన్లు.. ఆర్మీ కేంద్రంపైకి ఒకటి
ABN, Publish Date - May 22 , 2025 | 05:48 AM
కోల్‌కతాలో ప్రముఖ ప్రాంతాలపై డ్రోన్ల మాదిరి వస్తువులు సంచరించడంతో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు, ఫోర్ట్ విలియం మీదుగా ఇవి ఎగిరాయని అధికారులు తెలిపారు.
కోల్‌కతా, మే 21: కోల్‌కతాలో డ్రోన్ల సంచారం కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ ప్రదేశాలపై డ్రోన్లను పోలిన వస్తువులు ఎగురుతూ కనిపించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో కేంద్ర, రాష్ట్ర సంస్థలు అప్రమత్తమయ్యాయి. గూఢచర్యంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాయి. నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు, మైదాన్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి దాదాపు పది డ్రోన్ల లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ ఎగిరే వస్తువులను ముందుగా హేస్టింగ్స్ పోలీసు స్టేషన్ సిబ్బంది గుర్తించారు. అవి డ్రోన్ల మాదిరిగానే ఉన్నాయని పోలీసులు తెలిపారు. ద క్షిణ 24 పరగణాల జిల్లాలోని మహేశ్తల వైపు నుంచి అవి ఎగురుతూ వచ్చాయన్నారు. హేస్టింగ్స్ ప్రాంతం, రెండవ హుగ్లీ వంతెన(విద్యా సాగర్ సేతు)తో పాటు ఫోర్టు విలియం(ఆర్మీ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం) మీదుగా సంచరించాయని పేర్కొన్నారు. ఈ వార్తలపై రక్షణ శాఖ స్పందించింది. ‘‘డ్రోన్ వార్తల ప్రామాణికతను పరిశీలిస్తు న్నాం. ఊహాగానాలను వ్యాప్తి చేయొద్దు.’’ అని రక్షణ శాఖ కోరింది.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:48 AM