ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dhwani HGV Launch: అగ్ని-5ని మించి ధ్వని

ABN, Publish Date - Apr 19 , 2025 | 03:42 AM

అగ్ని-5 కంటే మెరుగైన శక్తితో, 6 నుంచి 10 వేల కిలోమీటర్ల రేంజ్‌తో ‘ధ్వని’ హెచ్‌జీవీ మోడల్‌ను డీఆర్‌డీవో ఆవిష్కరించింది. ఇది హైపర్‌సానిక్‌ వేగంతో ప్రయాణించి లక్ష్యాలను ఛేదించగల అత్యాధునిక సామర్థ్యం కల క్షిపణి వ్యవస్థగా నిలుస్తోంది

  • 6వేల నుంచి 10 వేల కిలోమీటర్ల రేంజ్‌!.. డీఆర్‌డీవో ఘనత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: రక్షణ పరిశోధనల్లో పలు అద్భుతాలు సాధిస్తున్న మన డీఆర్‌డీవో.. ధ్వని హైపర్‌సానిక్‌ గ్లైడ్‌ వెహికల్‌ (హెచ్‌జీవీ) ఫుల్‌ స్కేల్‌ మోడల్‌ను ఇటీవలే ఆవిష్కరించడం ద్వారా ప్రపంచం దృష్టిని మరోసారి ఆకర్షించింది. దాదాపు 29.5 మీటర్ల పొడుగు, 8 అడుగుల వెడల్పు ఉండే ఈ ధ్వని హెచ్‌జీవీ రేంజ్‌ ఎంతో డీఆర్‌డీవో వర్గాలు బయటకు వెల్లడించనప్పటికీ.. అది మన అమ్ములపొదిలో ఇప్పటికే ఉన్న అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి రేంజ్‌ (5,500 కి.మీ) కన్నా ఎక్కువగా (6-10 వేల కిలోమీటర్ల దాకా) ఉంటుందని సమాచారం. అంటే.. మనదేశంలోని లాంచ్‌ సైట్ల నుంచి ఆసియా, యూర్‌పతోపాటు ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాల్లోని లక్ష్యాలను సైతం ఇది ఛేదించగలదు. కాగా.. ధ్వని హెచ్‌జీవీ ప్రయాణించే తీరు ప్రత్యేకంగా ఉంటుందని, తొలుత బాలిస్టిక్‌ బూస్ట్‌ దశ.. తర్వాత ఎక్స్‌టెండెడ్‌ గ్లైడ్‌ దశతో అది హైపర్‌సానిక్‌ వేగంతో సుదూరతీరాలకు ప్రయాణిస్తుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. గాల్లో వెళ్తుండగానే దిశ మార్చుకోగలిగే సామర్థ్యం ఽఉండే హెచ్‌జీవీలను సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం దాదాపు అసాధ్యం.

Updated Date - Apr 19 , 2025 | 03:42 AM