ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో ‘ధర్మశాస్త్ర స్టడీస్‌’ కోర్సు

ABN, Publish Date - Jun 14 , 2025 | 05:06 AM

ఢిల్లీ యూనివర్సిటీ ‘ధర్మశాస్త్ర స్టడీస్‌’ పేరిట కొత్త కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో భాగంగా వర్ణ, కుల వ్యవస్థ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో విద్యార్థులకు బోధిస్తారు.

న్యూఢిల్లీ, జూన్‌ 13: ఢిల్లీ యూనివర్సిటీ ‘ధర్మశాస్త్ర స్టడీస్‌’ పేరిట కొత్త కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో భాగంగా వర్ణ, కుల వ్యవస్థ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో విద్యార్థులకు బోధిస్తారు. నాగరిక సమాజాన్ని నిర్మించడంలో వివాహం పాత్ర, వ్యక్తిగత ప్రవర్తనను నైతికత ఎలా నియంత్రిస్తుందనే అంశాలతో పాటు రామాయణం, మహాభారతం, పురాణాలు వంటి హిందూ మత గ్రంథాలను సిలబ్‌సలో చేర్చారు. ప్రాచీన భారతదేశంలో న్యాయ వ్యవస్థలు, ప్రాయశ్చిత్తం, తపస్సు మొదలైన వాటిని వివరించే ధర్మ భావన, ధర్మ శాస్త్రం, వ్యవహారం, రాజకీయాలు అనే నాలుగు సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారు.

ఆపస్తంభ ధర్మసూత్రాలు, బౌద్ధాయన ధర్మసూత్రాలు, వశిష్ట ధర్మసూత్రాలు, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతితో పాటు కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ కోర్సులో సంస్కృతంలో పరిజ్ఞానం ఉన్న యూజీ విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఇందులో మనుస్మృతిని పాఠ్యాంశంగా చేర్చినప్పటికీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది నుంచి విమర్శలు రావడంతో దాన్ని సిలబస్‌ నుంచి తొలగించినట్లు వర్సిటీ ప్రకటించింది. భవిష్యత్తులో సైతం డీయూ అందించే ఏ కోర్సులోనూ మనుస్మృతిని బోధించబోమని స్పష్టం చేసింది.

Updated Date - Jun 14 , 2025 | 05:06 AM