ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Budget 2025: బడ్జెట్‌పై ప్రజల నుంచి సూచనలు కోరిన సీఎం

ABN, Publish Date - Mar 03 , 2025 | 03:19 PM

మహిళా సమ్మాన్ యోజనతో సహా బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ బడ్జెట్‌లో చేర్చనున్నట్టు సీఎం తెలిపారు. మార్చి 5న దీనిపై చర్చించేందుకు మహిళా సంస్థలన్నింటినీ విధాన సభకు ఆహ్వానిస్తున్నామనీ, బడ్జెట్‌పై వారంతా తగిన సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని చెప్పారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ బడ్జెట్‌ (Delhi Budget 2025)పై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించింది. బడ్జెట్ రూపకల్పనలో ప్రజలు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. డిల్లీ బడ్జెట్‌ను మార్చి 24-26 మధ్య ప్రవేశపెట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల సూచలను చేరుస్తూ 'వికసిత్ ఢిల్లీ' విజన్‌ను బడ్జెట్ ప్రతిబింబిస్తుందని సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి


''ఈ బడ్జెట్ 'వికసిత్ ఢిల్లీ' బడ్జెట్. ఇందులో ప్రజలు ఇచ్చే సూచనలను చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మహిళలకు ఆర్థిక సాయం, కాలుష్య నియంత్రణ, పేదలకు చవకగా నాణత్య కలిగిన ఆహారం, వయోవృద్ధులకు హెల్త్ ఫెసిలిటీ, గంగా జలాల ప్రక్షాళన వంటి హామీల అమలుకు ప్రయత్నిస్తున్నాం'' అని రేఖా గుప్తా తెలిపారు.


మహిళా సమ్మాన్ యోజనతో సహా బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ బడ్జెట్‌లో చేర్చనున్నట్టు సీఎం తెలిపారు. మార్చి 5న దీనిపై చర్చించేందుకు మహిళా సంస్థలన్నింటినీ విధాన సభకు ఆహ్వానిస్తున్నామనీ, బడ్జెట్‌పై వారంతా తగిన సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని చెప్పారు. బడ్జెట్‌పై సలహాలను వాట్సాప్ నెంబర్ (9999962025)కు పంపాలని ప్రజలను ఆమె కోరారు.


ఇవి కూడా చదవండి

Mamata Banerjee: డూప్లికేట్‌ ఎపిక్‌ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!

Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 03 , 2025 | 03:20 PM