ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Assembly Elections: సీఎంపై కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. ఎవరంటే..?

ABN, Publish Date - Jan 03 , 2025 | 06:17 PM

ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో 51-కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అల్కా లంబా అభ్యర్థిత్వాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదించినట్టు ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) 'ఆప్' సీనియర్ నేత, ముఖ్యమంత్రి అతిషి (Atishi)పై పోటీ చేసే కాంగ్రెస్ (Congress) అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. కల్కాజీ నియోజకవర్గం (Kalkaji Constituency) నుంచి తమ అభ్యర్థిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా శుక్రవారంనాడు ప్రకటించింది. కల్జాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా అతిషి పోటీలో ఉన్నారు.

Delhi Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా బీజేపీ చీఫ్


ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో 51-కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అల్కా లంబా అభ్యర్థిత్వాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదించినట్టు ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. కల్కాజీ నియోజకవర్గంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సంప్రదాయకంగా హోరాహోరీ పోరు ఉంటుంది. కాగా, అల్కా లంబా 2015లో 'ఆప్' టిక్కెట్టుపై చాందినీ చౌక్ నుంచి గెలిచారు. 2019లో పార్టీ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్‌లో చేరారు.


ఫిబ్రవరిలో ఎన్నికలు

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నారు. గత ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. ఎన్నికల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి 2025 ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది.


ఇవి కూడా చదవండి..

CT Ravi: సువర్ణసౌధ ఘటనపై సీటీ రవి ఆగ్రహం

Flights Delayed: ప్రయాణికులకు అలర్ట్.. దాదాపు 200 విమానాలు ఆలస్యం, రద్దు

For National News And Telugu News

Updated Date - Jan 03 , 2025 | 06:18 PM