ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Census: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించండి

ABN, Publish Date - May 03 , 2025 | 04:20 AM

దేశవ్యాప్తంగా తెలంగాణ తరహాలో కులగణన జరిపించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. పహల్గాం దాడిపై కేంద్రం ఇప్పటివరకు స్పష్టమైన వ్యూహాన్ని వెల్లడించకపోవడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రశ్నించింది.

సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో

వెనకబాటుతనం గుర్తింపునకు కులగణన జరపండి

తెలంగాణ నమూనానే దేశానికి ఆదర్శం కావాలి

ప్రైవేటు సంస్థల్లోనూ కోటా కోసం చర్యలు చేపట్టాలి

బిహార్‌ ఎన్నికల కోసమే కులగణనపై ప్రకటన

మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

పహల్గాంపై ఇంకెంతకాలం మౌనం?: సీడబ్ల్యూసీ

కులగణనపై గతంలో మా డిమాండ్‌ను

వ్యతిరేకించారు.. రాహుల్‌ ఒత్తిడి వల్లే దిగివచ్చారు

ఈ క్రెడిట్‌ పూర్తిగా రాహుల్‌గాంధీదే: ఖర్గే

న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జరిగినట్లుగా దేశమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనకబాటుతనాన్ని నిర్ధారిస్తూ కులగణన జరిపించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్‌ చేసింది. కులగణన విషయంలో తెలంగాణ నమూనానే దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసింది. తెలంగాణలో అత్యంత శాస్త్రీయంగా, వివిధ రంగాల్లో వెనకబాటుతనాన్ని నిర్ధారిస్తూ కులగణన జరిగిందని, మోదీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన కులగణన జరపాలని నిర్ణయిస్తుందో తెలియజేయాలని కోరింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ప్రైవేట్‌ సంస్థల్లోనూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటు తనాన్ని నిర్ధారించి రిజర్వేషన్లు ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలోని 15(5) అధికరణను సవరిస్తారో లేదో చెప్పాలని కోరింది. ఆర్థికంగా వెనుకబాటు తనాన్ని కూడా నిర్ణయించి పదిశాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు 103వ రాజ్యాంగ సవరణను ఏ విధంగా అమలు చేస్తారో తెలియజేయాలని డిమాండ్‌ చేసింది.

బిహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మాత్రమే కులగణన జరిపిస్తామని ప్రకటించారని, నిజానికి ఆ విషయంలో మోదీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు.


గతంలో మా డిమాండ్‌ను వ్యతిరేకించారు..

కులగణనను డిమాండ్‌ చేసిన వారిని మోదీ గతంలో అర్బన్‌ నక్సల్స్‌గా అభివర్ణించారని, ఆర్‌ఎ్‌సఎస్‌ కూడా కులగణనను వ్యతిరేకించిందని సీడబ్ల్యూసీ గుర్తు చేసింది. కుల గణన ఎప్పుడు జరిపిస్తారో, ఎలా జరిపిస్తారో చెప్పకుండా రాజకీయ ప్రయోజనం పొందేందుకు ఉట్టి ప్రకటనలు చేయడంతో సరిపోదని పేర్కొంది. కులగణనను శాస్త్రీయంగా జరిపించాలని రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా డిమాండ్‌ చేశారని, తెలంగాణలో అన్నమాట ప్రకారం శాస్త్రీయంగా కులగణన జరిపించారని, ఈ విషయంపై వివిధ సామాజిక వర్గాల్లో చైతన్యం ఏర్పడుతుందని తెలిసినందువల్లే మోదీ సర్కారు దిగి వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఒక రకంగా రాహుల్‌గాంధీ వల్లే మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై కులగణనను జరిపించేందుకు దిగి వచ్చిందని వర్కింగ్‌ కమిటీలో నేతలు పేర్కొన్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి తెలియజేయాలని, వివిధ రంగాల్లో వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా నిర్ధారించి వెనుకబడిన వర్గాలకు వారి వాటా వారికి లభించేంత వరకు కాంగ్రెస్‌ నిశ్రమించకూడదని సీడబ్ల్యూసీ పిలుపునిచ్చింది. కాగా, సీడబ్ల్యూసీ భేటీలో సభ్యులకు తెలంగాణలో జరిపిన కులగణనకు సంబంధించి నివేదికలను అందజేశారు.


పహల్గాం దాడిపై చర్యలకు నిర్దిష్ట వ్యూహమేదీ?

పహల్గాం సంఘటనపై కూడా సుధీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించింది. ఇంకెంతకాలం వేచి చూస్తారని సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించిందని, కానీ, ఇంతవరకు తమ రణనీతి ఏమిటో ప్రభుత్వం వెల్లడించలేదని పేర్కొంది. దేశ ఐక్యత, సమగ్రతకు ఏ సవాళ్లు ఎదురైనా వాటిపై పోరాడేందుకు తాము కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దేశ సమగ్రతను, ఐక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న పాక్‌ పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ధృడమైన చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఒంటరిని చేసేలా సమస్వయంతో ముందుకెళ్లాలని సూచించింది. భారత్‌ మొత్తం ఒక్కటిగా ఉందని, ఎవరూ విడదీయలేరనే సందేశాన్ని పాక్‌కు ఇవ్వాలని పేర్కొంది. ప్రతిపక్షం మొత్తం ప్రభుత్వం వెంటే ఉంటామని ప్రకటించినా ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద నిర్దిష్ట వ్యూహమేదీ కనిపించడం లేదని ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే అన్నారు. వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు వంశీచందర్‌ రెడ్డి, కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పళ్లం రాజు తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 03 , 2025 | 04:20 AM