ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిలుగా ముగ్గురి పేర్లు సిఫార్సు

ABN, Publish Date - May 27 , 2025 | 05:06 AM

సుప్రీంకోర్టు కొలీజియం కర్ణాటక, గువాహటి, బాంబే హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సిఫారసు చేసింది. ఈ పదోన్నతలు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, ఎ.ఎ్‌సీ.ఓకా, హృషీకేశ్‌ రాయ్ పదవీ విరమణల కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తాయి.

జస్టిస్‌ అంజారియా, జస్టిస్‌ విజయ్‌, జస్టిస్‌ చందూర్కర్‌లకు పదోన్నతి

సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదన

న్యూఢిల్లీ, మే 26: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, మరో హైకోర్టు జడ్జికి పదోన్నతులు కల్పించాలని కొలీయం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ అధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల కొలీజియం సోమవారం ఇక్కడ భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ అంజారియా, గువాహటి హైకోర్టు సీజే జస్టిస్‌ విజయ్‌బిష్ణోయ్‌, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చందూర్కర్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని ప్రతిపాదించింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎ.ఎ్‌స.ఓకా, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌ల పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీల్లో వీరిని భర్తీ చేయనున్నారు.

జస్టిస్‌ అంజారియా స్వస్థలం అహ్మదాబాద్‌

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అంజారియా 1965లో అహ్మదాబాద్‌లో జన్మించారు. 1989లో అక్కడి యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి మాస్టర్‌ డిగ్రీ పొందిన ఆయన తొలుత గుజరాత్‌ హైకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2024 ఫిబ్రవరి 25 నుంచి కర్ణాటక హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

జస్టిస్‌ విజయ్‌ది రాజస్థాన్‌

గువాహటి హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ది రాజస్థాన్‌. 1964లో జన్మించిన ఆయన 1989లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2013లో రాజస్థాన్‌ హైకోర్టులో తాత్కాలిక జడ్జిగా, 2015లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 ఫిబ్రవరి 5 నుంచి గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.


చందూర్కర్‌ నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీకి...

1965లో జన్మించిన జస్టిస్‌ చందూర్కర్‌ 1988లో న్యాయవాదిగా చేరారు. 1992 నుంచి నాగ్‌పూర్‌లో స్థిరపడి అక్కడ పలు కోర్టుల్లో వాదనలు వినిపించారు. 2013లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, అనంతరం శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఐదు హైకోర్టులకు కొత్త సీజేలు

మరో అయిదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని కూడా కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్‌, కర్ణాటక, గువాహటి, పట్నా, ఝార్ఖండ్‌ హైకోర్టులకు కొత్త చీఫ్‌ జస్టి్‌సలు రానున్నారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవాను అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ విభు బఖ్రును కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా నియమించాలని ప్రతిపాదించింది. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ అశుతోష్‌ కుమార్‌ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సూచించింది. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ విపుల్‌ మనుబాయ్‌ పంచోలీని అదే హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. హిమాచల్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ తార్లోక్‌ సింగ్‌ చౌహాన్‌ను ఝార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:07 AM