ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistani citizen in India: తండ్రి భారతీయుడు.. తల్లి పాకిస్థానీ

ABN, Publish Date - Apr 29 , 2025 | 05:07 AM

కార్గిల్‌ యుద్ధ సమయంలో పాకిస్థాన్లో జన్మించిన రంశా 19 ఏళ్లుగా ధర్మవరంలో జీవిస్తోంది. ప్రస్తుతం లాంగ్‌టర్మ్‌ వీసాతో భారత్‌లో ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఉన్నారు.

ఏపీలో 19 ఏళ్లుగా పాకిస్థాన్‌ పౌరసత్వంతోనే కూతురు

ధర్మవరం రూరల్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ పౌరసత్వం ఉన్న ఓ యువతి 19 ఏళ్ల నుంచి శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉంటోంది. తండ్రి ఇండియన్‌, తల్లి పాకిస్థానీ కావడం, కార్గిల్‌ యుద్ధ సమయంలో తల్లి పాకిస్థాన్‌లో ప్రసవించడంతో ఆ యువతి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ధర్మవరం పట్టణంలోని చంద్రబాబునగర్‌కు చెందిన రఫీక్‌ అహ్మద్‌ ఆయుర్వేద వైద్య నిపుణుడు. బళ్లారికి చెందిన ఇతడి మేనమామ మహబూబ్‌ పీరాన్‌.. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. రఫీక్‌ 1989లో మేనమామ కూతురు జీనత్‌ పీరాను వివాహం చేసుకున్నాడు. రఫీక్‌, జీనత్‌ దంపతులకు మొదట ఇక్కడే కుమారుడు జన్మించాడు. జీనత్‌ 1998లో రెండోసారి గర్భం దాల్చింది. ఆ సమయంలో తన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసేందుకు జీనత్‌ కరాచీ వెళ్లింది. అదే సమయంలో కార్గిల్‌ యుద్ధం జరగడంతో ఆమె వెంటనే భారత్‌కు తిరిగిరాలేకపోయింది. ఈ క్రమంలో 1999లో కూతురు రంశాకు జన్మినిచ్చింది. 2005లో ఆమె తన కూతురిని తీసుకుని ధర్మవరంలో ఉన్న భర్త వద్దకు వచ్చింది. దాదాపు ఏడేళ్లపాటు అక్కడే ఉండటంతో రంశాకు పాకిస్థాన్‌ ప్రభుత్వం అక్కడి పౌరసత్వాన్ని ఇచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు రంశాకు తల్లిదండ్రులు లాంగ్‌ విజిట్‌ వీసా తీసుకున్నారు. ప్రస్తుతం రంశా వయసు 26 ఏళ్లు. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ధర్మవరంలో చదువుకుంది. అనంతపురంలో బీ ఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఇప్పటికీ ఆమె పాకిస్థాన్‌ పౌరసత్వంతోనే ఉంటోంది. లాంగ్‌ విజిట్‌ వీసా 2029 వరకు ఉంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో ఉన్న పాకిస్థాన్‌ పౌరుల వివరాలను సేకరిస్తున్న క్రమంలో రంశా పౌరసత్వం విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ.. రంశా రఫీక్‌కు లాంగ్‌టర్మ్‌ వీసా ఉందని, ఆ వీసా కింద దేశంలో ఉండవచ్చనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలున్నాయని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:07 AM