CPEC extension: అఫ్ఘానిస్థాన్‌లోకి చైనా-పాక్
ABN, Publish Date - May 22 , 2025 | 05:16 AM
చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రులు బీజింగ్‌లో సమావేశమై సీపెక్‌ను అఫ్ఘానిస్థాన్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ కారిడార్ విస్తరణతో ఆ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ఎకనామిక్ కారిడార్ విస్తరించాలని మూడు దేశాల నిర్ణయం
న్యూఢిల్లీ, మే 21: చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)ను అఫ్ఘానిస్తాన్‌కు కూడా విస్తరించాలని నిర్ణయించారు. చైనా రాజధాని బీజింగ్‌లో బుధవారం చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. సీపెక్‌ను విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి ప్రకటన ఇషాక్ ధార్ ఎక్స్‌లో పోస్టు చేశారు. సీపెక్‌ను అఫ్ఘానిస్థాన్‌కు విస్తరించడం వల్ల ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సీపెక్‌పై తదుపరి సమావేశాన్ని అఫ్ఘానిస్థాన్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 60బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ఈ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళ్తోంది. ఈ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకిస్తోంది.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:16 AM