Young Man Mystery: భార్యతో గొడవపడి ప్రియురాలి దగ్గరకు.. ఊహించని విధంగా..
ABN, Publish Date - Jun 06 , 2025 | 08:20 AM
Young Man Mystery: శ్రీకాంత్.. లక్ష్మీ దేవి అనే యువతికి డబ్బులు ఆశ చూపి శారీరకంగా కలిసే వాడు. జూన్ 3వ తేదీన రాత్రి శ్రీకాంత్ భార్యతో గొడవపడ్డాడు. ఇంట్లోంచి బయటకు వచ్చాడు. నేరుగా లక్ష్మీ దేవి ఉండే చోటుకు వెళ్లాడు.
కోరికలు ఏవైనా అవి హద్దుల్లో ఉండాలి. లేకపోతే జీవితమే అర్థాంతరంగా ముగిసిపోతుంది. ఇందుకు చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ యువకుడు ఇంట్లో భార్యను కాదని, వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడు. డబ్బులు ఆశ చూపి, ఆమెతో శారీరకంగా కలిసేవాడు. అయితే, అదే అతడి కొంప ముంచింది. ఓ రోజు రాత్రి భార్యతో గొడవపడి.. అతడు తన ప్రియురాలి దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు.
సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు తరచుగా భార్యతో గొడవలు పడుతూ ఉండేవాడు. ఇంట్లో అందమైన భార్యను పెట్టుకుని లక్ష్మీ దేవి అనే యువతితో సంబంధం పెట్టుకున్నాడు. డబ్బులు ఆశ చూపి ఆమెతో శారీరకంగా కలిసే వాడు. జూన్ 3వ తేదీన రాత్రి శ్రీకాంత్ భార్యతో గొడవపడ్డాడు. ఇంట్లోంచి బయటకు వచ్చాడు. నేరుగా ప్రియురాలు ఉండే చోటుకు వెళ్లాడు.
అక్కడ లక్ష్మీ దేవి తన ప్రియుడు నరసింహ మూర్తితో కలిసి ఉంది. శ్రీకాంత్ నేరుగా వారి దగ్గరకు వెళ్లాడు. తన కోరిక తీర్చమంటూ లక్ష్మీదేవిపై బలవంతం చేశాడు. దీంతో శ్రీకాంత్‌కు, నరసింహ మూర్తికి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే నరసింహ మూర్తి.. శ్రీకాంత్‌ను బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం నరసింహ, లక్ష్మీ దేవి అక్కడినుంచి పారిపోయారు. మర్డర్ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
ఇవి కూడా చదవండి
ఈ రోజు నేషనల్ హాలిడే అంటూ వార్తలు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందంటే..
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు..
Updated Date - Jun 06 , 2025 | 08:36 AM