Justice Yashwant Verma: జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం
ABN, Publish Date - Jul 10 , 2025 | 05:23 AM
ఇంట్లో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ న్యాయమూర్తి, జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం
ప్రధాన పార్టీలతో సంప్రదింపులు
ఇప్పటికే మొదలైన ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియ
న్యూఢిల్లీ, జూలై 9: ఇంట్లో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ న్యాయమూర్తి, జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ తీర్మానానికి ప్రతిపక్షాల మద్దుతు లభిస్తుందని ఆశిస్తోంది. లోక్‌సభలో ఓ తీర్మానం ప్రవేశపెట్టాలంటే దానికి మద్దతుగా కనీసం 100 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ సంతకాల సేకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్టు సమాచారం.
ఈ ప్రక్రియ పూర్తయితే జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తప్పించేందుకు అవసరమైన తీర్మానానికి మద్దతు కోరుతూ ఉభయ సభల్లోని ప్రధాన పార్టీలతో కేంద్రం సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.
Updated Date - Jul 10 , 2025 | 05:23 AM