ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Political Controversy: మాలెగావ్‌ కేసులో భాగవత్‌ను అరెస్టు చేయాలన్నారు

ABN, Publish Date - Aug 02 , 2025 | 06:09 AM

మాలెగావ్‌ పేలుళ్ల కేసును విచారించిన మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎ్‌స)లో పనిచేసిన ఓ అధికారి

  • మహారాష్ట్ర ఏటీఎస్‌ అధికారి సంచలన ఆరోపణ

ముంబై, ఆగస్టు 1 : మాలెగావ్‌ పేలుళ్ల కేసును విచారించిన మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎ్‌స)లో పనిచేసిన ఓ అధికారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ను అరెస్టు చేయాలని దర్యాప్తు అధికారి పరమ్‌ వీర్‌ సింగ్‌ తనను ఆదేశించారని మెహబూబ్‌ ముజావర్‌ అనే రిటైర్డ్‌ పోలీసు అధికారి ఆరోపించారు. దేశంలో కాషాయ ఉగ్రవాదం ఉందనే వాదన సృష్టించాలని అలా ఆదేశించారని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. పరమ్‌ వీర్‌ సింగ్‌, ఆయన పైనున్న అధికారులు కొందరు.. రామ్‌ కల్సంగ్రా, సందీప్‌ డాంగే, దిలీప్‌ పాటిదార్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌లను అరెస్టు చేయాలని తనను ఆదేశించారని చెప్పారు. అప్పట్లో పరమ్‌ వీర్‌ సింగ్‌ చనిపోయిన వారిని బతికున్నట్లు చార్జిషీట్‌ రాయాలని తనను ఆదేశించారని పేర్కొన్నారు. ఆ ఆదేశాలను తాను తిరస్కరించడంతో తనను తప్పుడు కేసుల్లో ఇరికించారని పేర్కొన్నారు. అయితే వాటన్నిటి నుంచి తాను బయట పడ్డానన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 07:01 AM