Waqf Board: వక్ఫ్ బిల్లు సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ABN, Publish Date - Feb 27 , 2025 | 06:03 AM
వక్ఫ్ బిల్లు పరిశీలనకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సూచించిన సవరణలకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: వక్ఫ్ బిల్లు పరిశీలనకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సూచించిన సవరణలకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో రెండో దఫా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, చర్చించేందుకు మార్గం సుగమమైంది. జగదాంబిక పాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జేపీసీ కమిటీ కేంద్ర వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం, వివాదాలకు సంబంధించిన విచారణలను జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఉద్యోగికి అప్పగించడం, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిం ఓబీసీ వర్గం నుంచి ఓ వ్యక్తిని నియమించి, ఆయన అధికారాలను విస్తృతం చేయడం వంటి సవరణలను సూచించింది.
Updated Date - Feb 27 , 2025 | 06:03 AM