Jammu and Kashmir: మాయమైన ముగ్గురు కశ్మీరీల మృతదేహాలు లభ్యం.. ఏం జరిగిదంటే?
ABN, Publish Date - Mar 08 , 2025 | 07:19 PM
ఒక పెళ్లికి హాజరయ్యేందుకు కథువా నుంచి ముగ్గురు స్థానికులు గత గురువారం బయలుదేరారు. అప్పట్నించీ వారి ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే వీరిలో ఒకరు తాము కొండప్రాంతంలో దారితప్పామంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
శ్రీనగర్: రెండ్రోజుల క్రితం జాడతెలియకుండా పోయిన ముగ్గురు కశ్మీర్ యువకులు శవాలై తేలారు. భద్రతా బలగాలు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టడంతో ఈ ముగ్గురి మృతదేహాలు శనివారంనాడు లభ్యమయ్యాయి. కథువా జిల్లా బిల్లావార్ పర్యత ప్రాంతం వద్ద మృతదేహాలను కనుగొన్నారు. మరణించిన ముగ్గురిని వరుణ్ సింగ్ (15), యోగేష్ సింగ్ (32), దర్శన్ సింగ్ (40)లుగా గుర్తించారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ ముగ్గురు యువకులు ప్రమాదానికి గురై మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Ranya Rao Gold Sumggling Case: రన్యారావు కేసులో కీలక మలుపు.. రంగలోకి సీబీఐ
సంఘటన వివరాల ప్రకారం, ఒక పెళ్లికి హాజరయ్యేందుకు కథువా నుంచి ముగ్గురు స్థానికులు గత గురువారం బయలుదేరారు. అప్పట్నించీ వారి ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే వీరిలో ఒకరు తాము కొండప్రాంతంలో దారితప్పామంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టింది. డీజీఐ అధికారితో సహా ఇద్దరు సీనియర్ అధికార్లు సైతం గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కథువా జిల్లా బిల్లావార్ పర్వత ప్రాంతంలో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
తొలుత తీవ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేసినప్పటికీ దానిని ధ్రువీకరించలేదు. తాజాగా వారి మృతదేహాలు లభ్యం కావడంతో ప్రమాదం వల్ల మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్గం తర్వాతే వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 08 , 2025 | 07:19 PM