Share News

Ranya Rao Gold Sumggling Case: రన్యారావు కేసులో కీలక మలుపు.. రంగలోకి సీబీఐ

ABN , Publish Date - Mar 08 , 2025 | 06:14 PM

అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా రెండు టీమ్‌లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది.

Ranya Rao Gold Sumggling Case: రన్యారావు కేసులో కీలక మలుపు.. రంగలోకి సీబీఐ

న్యూఢిల్లీ: బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావు (Ranya Rao) అరెస్టు సంచలనం కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) రంగంలోకి దిగింది. దేశంలోని వివిధ విమానాశ్రయాల ద్వారా విదేశాల నుంచి ఇండియాలోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న స్మగ్లర్లపై కేసు నమోదు చేసింది. రన్యారావు అరెస్టు వెలుగులోకి రావడంతో మరిన్ని స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు అక్రమంగా ఇండియాకు బంగారం తరలించే అవకాశాలపై సీబీఐని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అప్రమత్తం చేసిన నేపథ్యంలో సీబీఐ కార్యాచరణకు దిగింది.

Ranya Rao Gold Smuggling: నటి రన్యా రావు ముఖంపై గాయాలు.. డీఆర్ఐ అధికారుల ఏం చెప్పారంటే..


దుబాయ్ నుంచి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన రన్యారావును గత సోమవారం రాత్రి డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 14.2 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాను తరచు దుబాయ్, అమెరికా, యూరప్ వెళ్లేదాన్నని డీఆర్ఏ విచారణలో రన్యారావు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రన్యారావు వెనుక అక్రమ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ఏదైనా ఉందా అనే కోణం నుంచి ప్రస్తుతం డీఆర్ఐ ఆరా తీస్తోంది. ఇదే క్రమంలో సీబీఐని అప్రమత్తం చేయడంతో అక్రమ గోల్డ్ స్లగ్లింగ్ కేసులో డీఆర్ఐ సహకారంతో దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా రెండు టీమ్‌లను బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు పంపింది.


సీబీఐ పాత్ర ఏమిటి?

విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణాకు సహకరిస్తున్న స్మగర్ల నేషనల్ నెట్‌వర్క్‌ను కనిపెట్టడంతో పాటు విమానాశ్రయాల వల్ల వీరికి ఎవరి నుంచి సహకారం అందుతోందనే విషయాలపై సీబీఐ దర్యాప్తు జరుపనుంది. కస్టమ్స్, పోలీస్, విమానాశ్రయ అధికారులతో సహా ప్రభుత్వాధికారుల ప్రమేయంపై ఆరా తీయనుంది. దర్యాప్తు తదుపరి దశలో రన్యారావును సీబీఐ కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ

PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..

Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2025 | 06:14 PM