Ranya Rao Gold Smuggling: నటి రన్యా రావు ముఖంపై గాయాలు.. డీఆర్ఐ అధికారుల ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:17 PM
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన నటి రన్యా రావు ముఖంపై గాయాలు ఉన్నాయని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆమె వెనక పెద్ద ముఠా ఉందని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసును విచారిస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు తాజాగా కీలక విషయాలు కోర్టుకు సమర్పించారు. నటి వెనక భారీ ముఠా ఉన్నట్టు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుల్లో వీఐపీల ప్రొటోకాల్స్‌ను దుర్వినియోపరుస్తూ స్మగ్లింగ్‌కు దిగారని పేదర్కొంది. రన్యా రావు కూడా ఈ సిండికేట్‌లో ముఖ్య భాగమని వెల్డించింది.
నటి రన్యా రావు ముఖంపై గాయాలను కూడా గుర్తించామని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. ఇది కేసును మరింత సంక్లిష్ట పరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, తనకు ఆ గాయాలు దుబాయ్ వెళ్లక ముందే ఉన్నట్టు నటి అధికారులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నటికి కావాల్సి వైద్య సహాయం అందించే ఏర్పాటు చేయాలంటూ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
కాగా, నటి తరపు లాయర్ తన వాదనలు వినిపిస్తూ లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలని అభ్యర్థించారు. ఆమె కంటికి కనిపించే దూరంలో లాయర్ సమక్షంలో విచారణ జరగాలని అన్నారు. అయితే, న్యాయస్థానం ఈ విజ్ఞప్తిని తోసి పుచ్చింది.
PM Modi: 2050కల్లా 44 కోట్ల మందికి ఊబకాయం
ఇక విచారణకు నటి రన్యా రావు పూర్తిగా సహకరించట్లేదని కూడా డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తరచూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతోందని అన్నారు. ఇక శుక్రవారం కోర్టులో జడ్జి ముందు రన్యాను హాజరు పరిచిన సమయంలో కూడా ఆమె కన్నీటి పర్యంతమైంది. అయితే, విచారణలో లభించే ఫోరెన్సీ ఆధారాల సాయంతో అనుమానితుల్ని ప్రశ్నిస్తామని అధికారులు వెల్లడించారు. బంగారం బార్స్‌ను బ్యాండేజీలు, టిష్యూలతో ఒంటికి చుట్టుకుని నటి అక్రమ రవాణాకు పాల్పడిందని కూడా అన్నారు.
Mumbai: ఈ చివరి క్షణంలోనూ నీపై ప్రేమే..
కాగా, బంగారం అక్రమ రవాణా వెనక ఎవరున్నారనేదానిపై విచారణ మళ్లడంతో కోర్టు డీఆర్‌ఐ అధికారులకు మూడు రోజుల పాటు రన్యా రవు కస్టడీని అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 6 .00 నుంచి 6.30 గంటల మధ్యలో ఆమెను అధికారుల సమక్షంలో కలిసి మాట్లాడేందుకు నటి లాయర్‌ను అనుమతించింది. రన్యాను కలిసేందుకు బంధువులు, స్నేహితులు, ఇతర వ్యక్తులెవరికీ అనుమతి లేదని స్పష్టం చేసింది.