ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fireworks Explosion: తమిళనాడులో బాణసంచా పేలి ఏడుగురి మృతి

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:41 AM

తమిళనాడులోని విరుదునగర్‌, సేలం జిల్లాల్లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనల్లో 7 మంది మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉంటారు, మరియు మరికొందరు గాయపడినట్టు అధికారులు తెలిపారు.

చెన్నై, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): బాణసంచా కర్మాగారంలో, ఆలయ రథోత్సవం సందర్భంగా జరిగిన బాణసంచా పేలుడు ఘటనల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. తమిళనాడులోని విరుదునగర్‌, సేలం జిల్లాల్లో ఈ ప్రమాదాలు సంభవించాయి. మృతుల్లో ఇద్దరు బాలురు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం విరుదునగర్‌ జిల్లా శివకాశిలోని ఓ బాణసంచా కర్మాగారంలో కార్మికులు రసాయనాల మిశ్రమాన్ని సిద్ధం చేస్తుండగా హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి సేలం జిల్లా కంచనాయకన్‌పట్టి గ్రామంలో ద్రౌపది అమ్మవారి ఆలయ రథోత్సవం సందర్భంగా మరో ఘటన జరిగింది. కొంతమంది బాణసంచా కాల్చగా, ఆ నిప్పు రవ్వలు ఓ మోటార్‌ బైక్‌పై ఉంచిన బాణసంచా బస్తాకు అంటుకున్నాయి. ఆ బస్తాలో ఉన్న శక్తిమంతమైన టపాసులు పేలడంతో 11 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.


ఇవి కూడా చదవండి:

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..

Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్

Updated Date - Apr 27 , 2025 | 01:41 AM