Bilawal Bhutto: పాక్ ఉగ్రవాద చరిత్రలో రహస్యమేమీ లేదు
ABN, Publish Date - May 03 , 2025 | 04:49 AM
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో, ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ముజాహిదీన్‌లకు పాకిస్థాన్ అందించిన మద్దతును అంగీకరించారు. ఈ దశలను తన దేశ చరిత్రలో దురదృష్టకరంగా పేర్కొన్న ఆయన, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ, మే 2: పాకిస్థాన్ ఉగ్రవాద చరిత్ర అంత రహస్యమేమీ కాదని.. ఏనాటి నుంచో దశలు, దశలుగా కొనసాగుతూ వస్తోందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అంగీకరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మొదటి ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ముజాహిదీన్‌లకు ఆర్థికంగా, నైతికంగా తోడ్పాటు ఇచ్చాం. పశ్చిమ దేశాలతో కలసి ఆ పనిచేశాం. తర్వాత దశలు దశలుగా అది కొనసాగింది. దానితో ఇబ్బందిపడ్డాం. ఇటీవలి కాలంలో పరిస్థితిలో మార్పు వచ్చింది. అది మా దేశ చరిత్రలో దురదృష్టకర భాగం. కానీ మేం దాని నుంచి పాఠాలు నేర్చుకున్నాం.’’ అని పేర్కొన్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భుట్టో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట
Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..
Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు
Updated Date - May 03 , 2025 | 04:49 AM