ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: అత్తను ఎలా చంపాలి.. మెసేజ్ పెట్టిన కోడలు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:46 PM

అత్తా కోడళ్ల పంచాయితీకి సంబంధించిన వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కోడలిని చిత్రహింసలు పెడుతున్న అత్త.. అత్తపై దాడి చేసిన కోడలు.. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి.

Bengaluru Women Messaged Doctor

బెంగళూరు, ఫిబ్రవరి 19: అత్తా కోడళ్ల పంచాయితీకి సంబంధించిన వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కోడలిని చిత్రహింసలు పెడుతున్న అత్త.. అత్తపై దాడి చేసిన కోడలు.. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగు చూసింది. అయితే ఈ సోర్టీ చాలా భయనకంగా ఉంటుంది. ఓ మహిళ తన అత్తను చంపేందుకు.. ఏకంగా డాక్టర్‌నే సలహా అడిగింది. వాట్సాప్‌లో డాక్టర్‌కు మెసేజ్ చేసిన ఆ మహిళ.. నా అత్తను చంపేయాలి.. ఇందుకోసం ఎలాంటి మందులు వేయాలో చెబుతారా? అంటూ ఆ మెసేజ్‌లో పేర్కొంది. అది చూసి అవాక్కవ్వడం ఆ డాక్టర్ వంతైంది.. మరి ఆ మహిళ తన అత్తను ఎందుకు చంపాలనుకుంది.. ఆ మెసేజ్ చూసిన డాక్టర్ ఏం చేశాడు.. తరువాత జరిగిన ట్విస్ట్ ఏంటి.. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..


కొందరు అత్తా కోడళ్లు మంచిగా ఉంటారు.. మరికొందరు బద్ధ శత్రువుల్లా ఉంటారు.. మంచిగా ఉంటే పర్లేదు. శత్రువుల్లా ఉంటేనే అసలు సమస్య. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అత్తాకోడళ్లు కూడా శత్రువుల్లా నిత్యం ఘర్షణకు దిగేవారు. కోడలు తన అత్తను ఎంతగా ద్వేషించేదంటే.. ఆమె ప్రాణాలు తీయాలని పథకాలు వేసింది. ఈ క్రమంలోనే.. వాట్సాప్‌లో వైద్యుడికి మెసేజ్ చేసి.. తన అత్తను చంపాలనుకుంటున్నట్లు చెప్పింది. ఆమెను అంతమొందించేందుకు ఎలాంటి మందు వాడాలో చెప్పరా అంటూ సలహా కోరింది. ఆ మెసేజ్ చదివిన వైద్యుడు షాక్ అయ్యాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది.


ఆ ట్విస్ట్ ఏంటంటే.. మెసేజ్ చేసిన మహిళ ఎవరో ఆ వైద్యుడికి తెలియదు. పైగా ఆ మహిళ తాను పంపిన మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేసి నెంబర్‌ను బ్లాక్ చేసింది. కానీ, ఇంతలోనే డాక్టర్ ఆ మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీసుకుని దగ్గర పెట్టుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి. ఆ స్క్రీన్‌షాట్స్‌ని పోలీసులకు చూపించి.. కంప్లైట్ చేశాడు. ఇది కుట్ర కావచ్చునని అనుమానం వ్యక్తం చేశాడు వైద్యులు.

డాక్టర్ సునీల్ కుమార్ పోలీసులకు ఏం చెప్పాడంటే.. ‘నేను సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటాను. కొన్ని రోజుల క్రితం సహానా అనే మహిళ ఇన్‌స్టాగ్రమ్‌లో నాకు మెసేజ్ చేసింది. అక్కడ తాను పేషెంట్‌లా పరిచయం చేసుకుంది. నాతో మాట్లాడటం కోసం ఫోన్ నెంబర్ అడిగింది. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ తరువాత ఫిబ్రవరి 17న నా వాట్సాప్‌కు సహానా ఒక మెసేజ్ పెట్టింది.’ అని చెప్పుకొచ్చాడు.


వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదే..

సహానా: హలో.. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కానీ, మీరు నన్ను తిడతారని భయపడుతున్నాను.

డాక్టర్: పర్వాలేదు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు?

సహానా: నాకు చెప్పడానికి భయంగా ఉంది.

డాక్టర్: భయపడకు, చెప్పు.

సహానా: నా అత్తను చంపడానికి ఏదైనా మందు చెప్పండి.

డాక్టర్: హత్య చేసేందుకా? కానీ ఎందుకు?

సహానా: మా అత్త నన్ను చాలా హింసిస్తారు. వాళ్ల చిత్రహింసలు నేను భరించలేకపోతున్నాను.

డాక్టర్: మేము వైద్యులం, ప్రాణాలను కాపాడటమే మా పని. ఎవరి ప్రాణాలను తీయకూడదు.

అని ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ వెంటనే సహానా.. డాక్టర్‌కి పంపిన మెసేజ్‌లను డిలీట్ చేసింది. ఆ వెంటనే అతని నెంబర్‌ను బ్లాక్ చేసింది.

నాపై కుట్ర చేశారేమో..

ఈ చాట్ గురించి పోలీసులకు వివరించిన డాక్టర్ సునీల్ కుమార్.. ఇది తనపై ఎవరైనా కుట్రలో భాగంగా చేశారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తాను రాజకీయంగా, సామాజికంగా చాలా చురుకుగా ఉంటానని.. ఇది జీర్ణించుకోలేక ఎవరైనా కుట్ర చేశారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. సహాన తాను పంపిన మెసేజ్‌లన్నింటినీ డిలీట్ చేసిందని, తన ఫోన్ నెంబర్‌కు కూడా బ్లాక్ చేసిందని చెప్పారు. కానీ, అంతకు ముందే తాను అన్ని మెసేజ్‌లను స్క్రీన్ షాట్‌ తీసిపెట్టుకున్నట్లు వైద్యుడు తెలిపారు. డాక్టర్ సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సంజయ్ నగర్ పీఎస్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

రైల్వే జాబ్స్ స్కాం.. పలువురు అధికారులపై సీబీఐ కేసు

విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు..

'మహాకుంభ్' కాదన్న వాళ్లు సనాతన్ వ్యతిరేకులు

For More National News and Telugu News..

Updated Date - Feb 19 , 2025 | 04:46 PM