Share News

School Holidays: విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు.. ఎప్పుడంటే..

ABN , Publish Date - Feb 19 , 2025 | 04:39 PM

విద్యార్థులకు హాలిడేస్ అంటే చాలు ఎగిరి గంతులు వేస్తారు. అయితే, ఫిబ్రవరి చివరిలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ఉంటే మరో రోజు మాత్రం రాష్ట్రంలోని కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.

School Holidays: విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు.. ఎప్పుడంటే..
School Holidays

విద్యార్థులకు సెలవులంటే చాలు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. టీచర్స్ క్లాసెస్, హోం వర్క్ బాధలు తప్పుతాయని హామ్మయ్య అని అనుకుంటారు. సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఫిబ్రవరి చివరి వారంలో రెండు రోజుల పాటు స్కూల్స్, కాలేజీలకు సెలవులు రానున్నాయి. మహా శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 26, 27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులను ప్రకటించింది.

రెండు రోజుల సెలవులు:

మహా శివరాత్రి (ఫిబ్రవరి 26): మహా శివరాత్రి పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్( ఫిబ్రవరి 27): తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ MLC స్థానాలకు ఎన్నికలు ఎంపిక చేసిన జిల్లాల్లో జరుగుతాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ఫిబ్రవరి 27న ప్రభుత్వం సెలవు ప్రకటించింది.


ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫిబ్రవరి 26 మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఉండగా ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పాఠశాలలకు ఫిబ్రవరి 27న సెలవు ఉంటుంది. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ స్థానాలకు ఓటు వేయడానికి అర్హులు.

Also Read: స్నీకర్స్ కొనేటపుడు ఈ 6 విషయాలను గుర్తుంచుకోండి..

Updated Date - Feb 19 , 2025 | 04:41 PM