Astrologer Sharmistha: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఆమె చెప్పిందే జరిగింది
ABN, Publish Date - Jun 13 , 2025 | 10:39 AM
Astrologer Sharmistha: జ్యోతిష్యురాలు షర్మిష్ట.. ఈ విమాన ప్రమాదం గురించి ముందే చెప్పారు. 6 నెలల ముందే దేశంలో విమాన ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. విమానం కూలడానికి వారం ముందు కూడా ఆమె ఇదే విషయం చెప్పారు.
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలు సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనలో ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 169 మంది ఇండియన్స్ కాగా.. 53 మంది యూకేకు చెందిన వారు.. ఏడుగురు పోర్చుగీస్.. కెనడాకు చెందిన ఓ వ్యక్తి ఉన్నాడు. వీరంతా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఓ వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
6 నెలల ముందే జ్యోష్యం..
ప్రముఖ జ్యోతిష్యురాలు షర్మిష్ట.. ఈ విమాన ప్రమాదం గురించి ముందే చెప్పారు. 6 నెలల ముందే దేశంలో విమాన ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. విమానం కూలడానికి వారం ముందు కూడా ఆమె ఇదే విషయం చెప్పారు. ఆమె చెప్పిందే జరిగింది. 2024, డిసెంబర్ 29వ తేదీన ఆమె తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ..‘2025లో విమానయాన రంగం మంచిగా పని చేస్తుంది. దాంతోపాటు విమాన ప్రమాదం జరిగి అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. నేను ఇది రెండు నెలల క్రితమే ఊహించాను’ అని పేర్కొన్నారు.
ప్రమాదం జరగడానికి 6 రోజుల ముందు కూడా ఆమె ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘టాటా కంపెనీ రఫేల్ యుద్ధ విమానాలను హైదరాబాద్‌లో తయారు చేస్తుంది. వచ్చే రెండేళ్లలో .. స్పేస్, శాటిలైట్ ఇంజనీరింగ్, స్పేస్ టూరిజం విషయంలో ఇస్రో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తుంది. 2025లో విమాన ప్రమాదం జరుగుతుందని నాకు గట్టిగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. ఆమె జూన్ 5వ తేదీన పోస్టు పెడితే.. జూన్ 12వ తేదీన విమానం కుప్పకూలిపోయింది. ప్రస్తుతం షర్మిష్ట పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..
Updated Date - Jun 13 , 2025 | 03:07 PM