Gaya district: బిహార్‌లో అంబులెన్స్‌లో యువతిపై అత్యాచారం
ABN, Publish Date - Jul 27 , 2025 | 06:17 AM
బిహార్‌లో అంబులెన్స్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పట్నా, జూలై 26: బిహార్‌లో అంబులెన్స్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గయా జిల్లాలోని బోధ్ గయాలో ఈ నెల 24న నిర్వహించిన హోంగార్డ్ నియామక పరీక్షకు 26 ఏళ్ల మహిళ హాజరైంది. దేహదారుఢ్య పరీక్ష నిర్వహిస్తుండగా ఆమె సృహతప్పి పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న తనపై అంబులెన్స్‌లో కొందరు అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఆరోపించింది. పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ వినయ్, టెక్నీషియన్ అజిత్‌లను అరెస్ట్ చేశారు.
Updated Date - Jul 27 , 2025 | 06:18 AM