ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maha Kumbh: కుంభమేళాను పొడిగించండి.. యోగి సర్కార్‌ను కోరిన అఖిలేష్

ABN, Publish Date - Feb 15 , 2025 | 06:29 PM

గతంలో మహాకుంభ్, కుంభ్‌మేళాలు 75 రోజుల పాటు నడిచేవని, ఇప్పుడు కుంభ్‌మేళాకు నిర్దేశించిన రోజులు తక్కువగా ఉన్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు.

లక్నో: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh)ను మరికొద్ది రోజులు పొడిగించాలని సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని శనివారంనాడు కోరారు. లక్షలాది మంది భక్త జనం పోటెత్తుతుండటం, ఎలాగైనా కుంభ్‌మేళాలో పాల్గొనాలనే ఆశతో వేలాది మంది రోడ్లపైనే నిరీక్షిస్తుండటంతో అఖిలేష్ ఈ విజ్ఞప్తి చేశారు. గతంలో మహాకుంభ్, కుంభ్‌మేళాలు 75 రోజుల పాటు నడిచేవని, ఇప్పుడు కుంభ్‌మేళాకు నిర్దేశించిన రోజులు తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు.

Arvind Kejriwal: ఎంసీడీ మేయర్ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు గట్టి దెబ్బ


''ఇప్పుడు కూడా చాలా మంది మహాకుంభ్‌కు వెళ్లాలని అనుకుంటున్నా వెళ్లలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో మహాకుంభ్ కాలవ్యవధిని (Time limit) ప్రభుత్వం పొడిగించాలి'' అని అఖిలేష్ కోరారు. కాగా, కొద్దిరోజులుగా మహాకుంభ్ మేళాకు వెళ్తున్న రైళ్లు కిటకిటలాడుతుండటం, రోడ్డన్నీ కిక్కిరిసి ఉండటం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఘాట్లకు వెళ్లే దారిలో కిలోమీటర్ల పొడవునా క్యూలు కనిపిస్తున్నాయి. విపరీతమైన రద్దీ కారణంగా ప్రయాగ్‌రాజ్ సంగమ్ రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేశారు.


ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్కిక ఉత్సవంగా నిర్వహిస్తున్న మహాకుంభ్ మేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26వ తేదీ 'మహాశివరాత్రి'తో ముగియనుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకూ త్రివేణి సంగమంలో స్నానాలు చేసిన వారి సంఖ్య 50 కోట్లకు చేరింది.


ఇవి కూడా చదవండి...

US Deportation Flights: భారత్‌కు మరో వలసదారుల విమానం.. ఏయే రాష్ట్రాల వారు ఉన్నారంటే..

Special Vande Bharat Train: నేటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కి ప్రత్యేక వందే భారత్ రైలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 06:29 PM