ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: కొడుకుని గొంతు కోసి చంపిన కిరాతక తండ్రి!

ABN, Publish Date - Mar 23 , 2025 | 03:52 AM

ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన తికేటి మాధవ సాఽధురావుగా గుర్తించామని ఇన్‌స్పెక్టర్‌ సీమా థకనే తెలిపారు.

భార్యతో తరచూ గొడవలే కారణం

మహారాష్ట్రలోని పుణేలో ఘటన.. నిందితుడు ఏపీలోని విశాఖ వాసి

పుణే, మార్చి 22: భార్యతో తరచూ గొడవల కారణంగా మూడున్నరేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేశాడో కిరాతక తండ్రి. కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన తికేటి మాధవ సాఽధురావుగా గుర్తించామని ఇన్‌స్పెక్టర్‌ సీమా థకనే తెలిపారు. 38 ఏళ్ల అతను ఐఐటీ బెంగళూరులో ఎంటెక్‌ చేశాడని, ఇంటి విషయాలపై మాధవ తన భార్య స్వరూపతో తరచూ గొడవ పడేవాడని పేర్కొన్నారు. మాధవ మగర్‌పట్టా సిటీలోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసేవాడు. అయితే రెండు నెలల క్రితం అతని ఉద్యోగం పోయింది. బీటెక్‌ చేసిన స్వరూప.. ఇంట్లోనే గృహిణిగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉద్యోగం పోయినప్పటి నుంచి వీరిద్దరు తమ సేవింగ్స్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. 2016 నుంచి పుణేలోని చందన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. డీసీపీ హిమ్మత్‌ జాదవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం..


గురువారం మధ్యాహ్నం మాధవ తన కుమారుడు హిమ్మత్‌ను ఇంటి నుంచి బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య పోలీసులకు మిస్సింగ్‌ ఫిర్యాదు చేసింది. మాధవ సెల్‌ఫోన్‌ నంబర్‌ను ట్రేస్‌ చేయగా.. వాడ్గావ్‌ షెరి ఏరియాలో ఐలా స్టే అనే లాడ్జిలో లొకేషన్‌ చూపించింది. అక్కడ ఒక రూమ్‌లో ఉన్న మాధవ.. తలుపు తీయకపోవడంతో పోలీసులు బద్దలు కొట్టారు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో పడి ఉండటాన్ని గుర్తించారు. అయితే అతని వద్ద కుమారుడు లేకపోవడంతో.. పోలీసులు అనుమానంతో స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నించారు. మొదట సరిగా సమాధానాలు చెప్పకపోవడంతో.. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో తన కుమారుడిని గొంతు కోసి హత్య చేసినట్లు మాధవ ఒప్పుకున్నాడు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని ఫారెస్ట్‌ పార్కు సమీపంలోని దట్టంగా పొదలు ఉన్న ప్రాంతంలో గుర్తించారు. కొడుకుని హత్య చేసిన తర్వాత ఒక దుకాణంలో బట్టలు కొనుక్కొని, రక్తం అంటిన దుస్తులను మార్చుకొన్న తర్వాత లాడ్జికి వెళ్లాడని, అక్కడ మద్యం తాగి నిద్రపోయాడని డీసీపీ జాదవ్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..


WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 03:54 AM