ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amritsar Hooch Tragedy: 21కి చేరిన మృతుల సంఖ్య.. పంజాబ్‌లో పెను విషాదం

ABN, Publish Date - May 13 , 2025 | 08:27 PM

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర విషాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.

Death toll in Punjab hooch tragedy rises to 21

పంజాబ్‌ (Punjab)లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర విషాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అమృత్‌సర్ మజితా బ్లాక్‌లోని భంగాలి కలన్, తారీవాల్, సంఘ, మరారి కలన్ గ్రామాలకు చెందిన కొంతమంది ప్రజలు మద్యం తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే (Amritsar Hooch Tragedy).


ఆ బాధితులందరినీ అమృత్‌సర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయానికి 14 మంది చనిపోయారు. తాజాగా ఆ సంఖ్య 21కి చేరింది. ఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులు, పోలీసులు ఆయా గ్రామాలకు చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య లక్షణాలు ఉన్నా, లేకపోయినా మద్యం తాగిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఆ మద్యం తయారీలో భారీగా మిథనాల్‌ను ఉపయోగించినట్టు తెలుసుకున్నారు.


ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు అధికారులను విధుల నుంచి తొలగించారు. జిల్లాకు చెందిన డీఎస్పీని, ఎక్సైజ్, టాక్సేషన్ అధికారి సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 13 , 2025 | 08:27 PM