Amit Shah: మావోయిస్టులారా ఆయుధాలను వదలండి
ABN, Publish Date - Apr 06 , 2025 | 02:43 AM
ఆయుధాలు వదిలేసి ప్రజలలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. 2026 మార్చిలోగా మావోయిస్టుల సమస్యను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని ఆయన బస్తర్ పాండూమ్ కార్యక్రమంలో వెల్లడించారు.
దంతెవాడ, ఏప్రిల్ 5: ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బస్తర్ పాండూమ్’ వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2026 మార్చి నాటికి మావోయిస్టుల బెడదను పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘‘బస్తర్‌లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిసిపోయాయి. ఆయుధాలను అడ్డం పెట్ట్టుకొని గిరిజన సోదరులు, సోదరీమణుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరు’ అని అమిత్ షా పేర్కొన్నారు. గత 50ఏళ్లగా బస్తర్ అభివృద్ధికి నోచుకోలేదని, బస్తర్ ప్రజలు తమ ఇళ్లను, ఊళ్లను నక్సలైట్ రహితంగా మార్చాలని బలమైన నిర్ణయం తీసుకుంటేనే అభివృద్ధికి బాటలు పడతాయని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News
Updated Date - Apr 06 , 2025 | 02:43 AM