Amit Shah: మన దళాల దెబ్బకు పాక్ ఇప్పట్లో కోలుకోలేదు
ABN, Publish Date - May 31 , 2025 | 06:22 AM
ఆపరేషన్ సిందూర్‌లో 118కి పైగా పాక్ సైనిక పోస్టులు, నిఘా నెట్‌వర్క్ బీఎస్‌ఎఫ్ ధ్వంసం చేసినట్లు అమిత్ షా చెప్పారు. జమ్మూలో పర్యటనలో ఆయన జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం లేదని స్పష్టం చేశారు.
బీఎస్‌ఎఫ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు
పూంచ్/జమ్మూ, మే 30: ఆపరేషన్ సిందూర్ సమయంలో 118కి పైగా పాక్ సైనిక పోస్టులను, వాటి నిఘా నెట్‌వర్క్‌ను బీఎ్‌సఎఫ్ పూర్తి గా ధ్వంసం చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మన దళాల దెబ్బకు పాకిస్థాన్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ, అమర్‌నాథ్ యాత్ర సన్నాహాలపై సమీక్షించడంతో పాటు పాక్ జరిపిన షెల్లింగ్ దాడులకు గురైన బాధిత కుటుంబాలను కలుసుకోవడానికి జమ్మూలో ఆయన చేపట్టిన రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. పాక్ దురాక్రమణకు దీటుగా స్పందించిన సరిహద్దు భద్రతా దళాన్ని(బీఎ్‌సఎ్‌ఫ)ను ఆయన ప్రశంసించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రధాని మోదీ హయాంలో 2014లో ప్రారంభమైన జమ్మూ కశ్మీర్ అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడం లేదా మందగించడం అనేదే ఉండదని స్పష్టం చేశారు.
Updated Date - May 31 , 2025 | 06:22 AM