Marriage: అమెరికా అమ్మాయి.. తమిళనాడు అబ్బాయి..
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:59 PM
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో పనిచేస్తున్న తమిళ యువకుడు.. అమెరికా యువతి ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం తిరువణ్ణామలై జిల్లా సెంజిలోని ఒక ప్రసిద్ధ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది.
- వైభవంగా ముగిసిన వివాహం
చెన్నై: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో పనిచేస్తున్న తమిళ యువకుడు.. అమెరికా యువతి ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం తిరువణ్ణామలై జిల్లా సెంజిలోని ఒక ప్రసిద్ధ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. జిల్లాలోని చెయ్యారు తాలూకా అనకావూరు గ్రామానికి చెందిన భాస్కరన్(Bhaskaran) పెద్ద కుమారుడు అవినాష్ నాసాలో పని చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: GBS virus: కలవరపెడుతున్న ‘జీబీఎస్’ వైరస్.. తొమ్మిదేళ్ల బాలుడి మృతి
అతడు అమెరికాకు చెందిన కేథరీన్ ఓసేవి అనే యువతిని ప్రేమించగా, రెండు కుటుంబ పెద్దల అనుమతితో వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో తమ కులదైవమైన సెంజిలోని ఏకాంబరేశ్వరాలయం(Ekambareshwara Temple)లో వీరి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.
ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి
ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News
Updated Date - Feb 04 , 2025 | 12:59 PM