ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mirage 2000: కుప్పకూలిన మిరాజ్ యుద్ధ విమానం.. పైలెట్లకు తీవ్ర గాయాలు..

ABN, Publish Date - Feb 06 , 2025 | 04:12 PM

ప్రముఖ మిరాజ్ యుద్ధ విమానం కుప్పకూలింది. సాధారణ శిక్షణ కోసం బయలుదేరిన క్రమంలో కూలిపోయిందని ప్రాథమికంగా చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Air Force Fighter Mirage 2000 Crashes

వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం (Mirage 2000 crash) ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదం సమయంలో అందులో పైలెట్ సహా మొత్తం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మిరాజ్ 2000 సాధారణ శిక్షణ కోసం బయలుదేరినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్మీ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ చర్యలు చేపడుతున్నాయి. అయితే యుద్ధ విమానం కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో చోటుచేసుకుంది.


ప్రమాదానికి కారణమిదేనా..

విమానం నేలను ఢీకొట్టడానికి ముందే పైలట్లు బయటకు దూకేశారని అంటున్నారు. వారికి గాయాలు కాగా, ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. సాంకేతిక కారణాల వల్లే విమానం కూలిపోయిందని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై వైమానిక దళం, జిల్లా పరిపాలన అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పర్యవేక్షించారు. ఆ ప్రదేశం నుంచి శిథిలాలను తొలగించే పని జరుగుతోంది.

ఈ ప్రమాదం తర్వాత వైమానిక దళ అధికారులు మొత్తం ఈ ఘటన గురించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మిరాజ్ 2000 ప్రమాదం వైమానిక దళానికి ఆందోళన కలిగించే విషయమని చెప్పవచ్చు. ఈ ఘటన వెనుక గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో సైన్యం విచారణకు ఆదేశించింది.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 06 , 2025 | 05:25 PM