Rekha Gupta: ఖజానా ఖాళీ చేసిన ఆప్.. మహిళలకు రూ.2,500 సాయంపై సీఎం
ABN, Publish Date - Feb 23 , 2025 | 09:07 PM
'మహిళా సమృద్ధి యోజన' కింద పేదకుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వాగ్దానం చేసింది. గర్బిణీలకు రూ.21,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
న్యూఢిల్లీ: మహిళలకు ఆర్థిక సాయం పథకం ఏం చేశారంటూ ''ఆమ్ ఆద్మీ పార్టీ'' నిలదీయడంపై ముఖ్యమంత్రి రేఖాగుప్తా (Rekha Gupta) ఘాటుగా స్పందించారు. గత ఆప్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిందని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పారు. అయినప్పటికీ ఈ పథకాన్ని తాము అమలు చేస్తామని తెలిపారు.
AICC Sessions: ఏఐసీసీ రెండ్రోజుల సమావేశాలు గుజరాత్‌లో.. ఎప్పుడంటే?
'మహిళా సమృద్ధి యోజన' కింద పేదకుటుంబాలకు చెందిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వాగ్దానం చేసింది. గర్బిణీలకు రూ.21,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
ఆర్థిక పరిస్థితిపై..
ఢిల్లీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై రేఖా గుప్తా మాట్లాడుతూ..."గత ప్రభుత్వం తప్పుకున్న తర్వాత ఆర్థిక పరిస్థితిపై అధికారులతో మేము సమీక్షించాం. ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. మహిళా సమృద్ధి యోజన అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ. మా సోదరీమణుల కోసం ఉద్దేశించినది. సమగ్రమైన ప్రణాళికతో తప్పనిసరిగా తీసుకువస్తాం'' అని అన్నారు.
దీనికిముందు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం పథకంపై చర్చించేందుకు 'ఆప్' లెజిస్లేటివ్ డెలిగేషన్‌తో ఆదివారంనాడు సమావేశం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేత అతిషి సీఎంకు లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో మహిళలకు రూ.2,500 ఇస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 20న జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించకపోవడంతో మోదీ గ్యారెంటీని నమ్మి మోసపోయామని ఢిల్లీ ప్రజలు అనుకుంటున్నారని సీఎంకు రాసిన లేఖలో అతిషి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 23 , 2025 | 09:19 PM