AAP leaders: సిసోడియా సత్యేందర్ జైన్‌పై ఏసీబీ కేసు
ABN, Publish Date - May 01 , 2025 | 04:58 AM
ఆప్ నేతలు సిసోడియా, సత్యేందర్ జైన్ పై తాజాగా మరో కేసు నమోదు అయింది. ₹2,000 కోట్లు వెచ్చించి 12,748 తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఏసీబీ ఆరోపించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సిసోడియా, సత్యేందర్ జైన్‌కు మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. మద్యం విధానం కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో పీకల్లోతులో కూరుపోయిన ఈ నేతలపై తాజాగా మరో కేసు నమోదైంది. రూ.2వేల కోట్లు వెచ్చించి చేపట్టిన 12,748 తరగతి గదులు, భవనాల నిర్మాణంలో కుంభకోణానికి సంబంధించి సిసోడియా, సత్యేందర్‌పై ఏసీబీ బుధవారం కేసు నమోదు చేసింది. తరగతి గదుల నిర్మాణ కాంట్రాక్టును 34మందికి అప్పగించారని, వీరిలో ఎక్కువమంది ఆప్ నేతలకు సన్నిహితులేనని ఏసీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఒక్కో తరగతి గది నిర్మాణానికి రూ.24.86 లక్షలను టెండర్లలో కోట్ చేశారని.. ఢిల్లీలో ఇందుకు రూ.5లక్షల చొప్పున మాత్రమే సరిపోతాయని ఏసీబీ పేర్కొంది.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..
Updated Date - May 01 , 2025 | 04:58 AM