New Delhi Station Stampede: తొక్కిసలాట ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం.. కేంద్రంపై ఆప్ సంచలన ఆరోపణ
ABN, Publish Date - Feb 16 , 2025 | 08:27 PM
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట విషాదం జరిగినప్పుడు రైల్వే మంత్రి దానిని గుర్తించేందుకు ఇష్టపడలేదని, ఎల్జీ మాత్రం ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత మృతుల సంఖ్య చెప్పకుండా ఆ పోస్ట్‌ను ఎడిట్ చేశారని సంజయ్ సింగ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి పలువురు దుర్మరణం పాలైన సంఘటనను కేంద్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆరోపించింది. అధికారికంగా ప్రకటించిన సంఖ్య కంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని కూడా చాలామంది చెబుతున్నారని పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
Delhi Stampede: రైళ్లు రద్దు కాలేదు, ఫ్లాట్‌ఫాం మార్చలేదు... తొక్కిసలాటపై రైల్వే శాఖ వివరణ
"అసలు తొక్కిసలాట ఘటనే జరగలేదని చూపించేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇంతటి సున్నితమైన అంశం విషయంలో ఎంతకాలం ఇలా దాగుడుమూతలాడతారు? ఘటనపై ప్రభుత్వం, రైల్వే మంత్రిని బాధ్యులను చేసెదెప్పుడు?'' అని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. మహాకుంభ్ మేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా పరిస్థితిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందన్నారు. శనివారంనాడు రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట విషాదం జరిగినప్పుడు కూడా రైల్వే మంత్రి దానిని గుర్తించేందుకు ఇష్టపడలేదని, ఎల్జీ మాత్రం ఒక ట్వీట్ చేసి ఆ తర్వాత మృతుల సంఖ్య చెప్పకుండా ఆ పోస్ట్‌ను ఎడిట్ చేశారని ఆరోపించారు.
ప్రత్యక్ష సాక్ష్యుల కథనాన్ని ఆయన ప్రస్తావిస్తూ, షెడ్యూల్డ్ రైళ్ల ఫ్లాట్‌ఫాం మారుస్తూ చేసిన ప్రకటన తొక్కిసలాటకు కారణమని తెలుస్తోందని చెప్పారు. ట్రైన్ ఫ్లాట్‌ఫాం 12వ నెంబర్ నుంచి 14వ నెంబర్‌కు మార్చడంతో తీవ్ర గందరగోళం తలెత్తి తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారని అన్నారు. ఇలాంటి ప్రకటన వల్ల తొక్కిసలాట జరుగుతుందనే విషయం రైల్వే శాఖకు తెలియదా అని ఆయన నిలదీశారు. ఈ ఘటనకు రైల్వే మంత్రి బాధ్యుడని అన్నారు. మృతుల కుటుంబాలకు తగినంత నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
Maha Kumbh 2025: కుంభమేళాకు అర్థమే లేదు.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?
Maharashtra: మహారాష్ట్రలో లవ్ జిహాద్ నియంత్రణకు చట్టం!
Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 16 , 2025 | 08:27 PM