ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Struggles Of India Elderly: విశ్రాంతి వయసులో జీవన పోరాటం

ABN, Publish Date - Aug 02 , 2025 | 06:02 AM

వృద్ధాప్యం వచ్చాక విశ్రాంతి తీసుకుందామంటే దేశంలో చాలామందికి పూటగడిచే పరిస్థితి లేదు. సత్తువ లేకపోయినా

  • దేశంలో వృద్ధులకు కరువైన ఆర్థిక భద్రత

  • ఇతరులపై ఆధారపడ్డ 70 శాతం మంది

  • పూటగడవాలంటే చాలామంది పని చేయాల్సిందే

న్యూఢిల్లీ, ఆగస్టు 1: వృద్ధాప్యం వచ్చాక విశ్రాంతి తీసుకుందామంటే దేశంలో చాలామందికి పూటగడిచే పరిస్థితి లేదు. సత్తువ లేకపోయినా పనిచేసి కడుపునింపుకోవాల్సిందే. ఇక 70% మంది ఆర్థికంగా ఇతరులపై ఆధారపడే జీవిస్తున్నారు. పలువురికిఆర్థిక, ఆరోగ్య భద్రత లేకుండా పోయాయి. ఇదీ దేశంలో వృద్ధుల పరిస్థితి అని ఓ అధ్యయన నివేదిక తాజాగా వెల్లడించింది. ‘భారతదేశంలో వృద్ధాప్యం.. సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై నీతి ఆయోగ్‌, సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ, జాతీయ మానన హక్కుల కమిషన్‌ భాగస్వామ్యంతో శంకలా షౌండేషన్‌ సంస్థ ఓ అధ్యయనం నిర్వహించి నివేదిక విడుదల చేసింది. దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభాపై లాంగిట్యూడినల్‌ ఏజింగ్‌ స్టడీ ఇన్‌ ఇండియా (ఎల్‌ఏఎ్‌సఐ) పేర్కొన్న అంశాలను ఆ నివేదికలో వివరణాత్మకంగా విశ్లేషించింది. పలువురు వృద్ధులు పస్తులతోనే రోజులు గడుపుతున్నారని వెల్లడించింది. చాలామందిలో శారీరక, మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని పేర్కొంది.

నివేదికలోని ముఖ్య అంశాలు..

  • దేశంలో 6.4% మంది వృద్ధులకు భోజన పరిమాణం తగ్గిపోయింది. 5.65 మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఏడాదిలో కనీసం ఒకరోజు పస్తులుండే వారు 4.2 శాతం మంది ఉన్నారు.

  • 60 ఏళ్లు పైబడిన వారిలో హృద్రోగ సమస్యలతో 35.6 శాతం, రక్తపోటుతో 32 శాతం, మధుమేహంతో 13.2 శాతం బాధపడుతున్నారు. హృద్రోగ బాధితులు ఎక్కువగా గోవా (60 శాతం), కేరళ (57 శాతం)లలో ఉన్నారు. ఎముకలు, కీళ్ల వ్యాధులతో 19 శాతం మంది వృద్ధులు బాధపడుతున్నారు. ఈ వ్యాధుల బాధితుల్లో 33 శాతంతో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.

  • ఇక మానసిక సమస్యలు కూడా వృద్ధుల్లో ఎక్కువ అవుతున్నాయి. డిప్రెషన్‌ లక్షణాలు 30 శాతం మందిలో కనిపిస్తున్నాయి.ఉమ్మడి కుటుంబాలు మాయమైపోతుండటంతో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. వృద్ధులైన మహిళలు 18.7 శాతం, పురుషులు 5.1 శాతం ఒంటిరిగా జీవిస్తున్నారు. కేరళలోని వృద్ధుల్లో 65ుమంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నారు.

  • ఇక 2021 నాటికి జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు కేరళలో 16.5 శాతం మంది ఉండగా, తమిళనాడులో 13.6 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌లో 13.1 శాతం, పంజాబ్‌లో 12.6 శాతం మంది ఉన్నారు. ఇక బిహార్‌లో (7.7 శాతం) అతి తక్కువ మంది ఉన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 06:02 AM