ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Massive Fine for Tree Cutting: 454 చెట్లను నరికించిన వ్యక్తికి 4.54 కోట్ల ఫైన్‌

ABN, Publish Date - Mar 27 , 2025 | 04:04 AM

తాజ్‌మహల్‌ సమీపంలో చట్టవిరుద్ధంగా చెట్లను నరికించిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు ఒక్కో చెట్టుకు రూ.లక్ష చొప్పున మొత్తం 454 చెట్లకు రూ.4.54 కోట్ల భారీ జరిమానా విధించింది.

న్యూఢిల్లీ, మార్చి 26: తాజ్‌మహల్‌ సమీపంలో చట్టవిరుద్ధంగా చెట్లను నరికించిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు ఒక్కో చెట్టుకు రూ.లక్ష చొప్పున మొత్తం 454 చెట్లకు రూ.4.54 కోట్ల భారీ జరిమానా విధించింది. తాజ్‌మహల్‌ చుట్టూ రక్షిత ప్రాంతంగా ప్రకటించిన ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్థలంలో ఉన్న 422 చెట్లు, వాటి పక్కనే రక్షిత అడవిలో ఉన్న మరో 32 చెట్లను శివ్‌శంకర్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి అక్రమంగా నరికించాడు. ఈ రక్షిత ప్రాంతంలోని చెట్లను నరికివేయరాదని 2015లోనే సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయినా అతడు దాన్ని ఉల్లంఘించాడు. తాను తప్పును అంగీకరిస్తున్నానని, జరిమానా తగ్గించాలని శివ్‌శంకర్‌ విన్నవించుకోగా బెంచ్‌ తిరస్కరించింది. ‘‘పెద్దఎత్తున చెట్లను నరికివేయడం ఓ మనిషిని హత్య చేయడంకంటే దారుణం’’ అని పేర్కొంది.

Updated Date - Mar 27 , 2025 | 04:04 AM