ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lost Luggage: ఎయిర్‌పోర్టులో తమ వస్తువులు పోగొట్టుకున్న వాళ్లు వెంటనే చేయాల్సిందేంటంటే..

ABN, Publish Date - Jun 23 , 2025 | 02:25 PM

ఎయిర్‌పోర్టుల్లో ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ప్రయాణికులు ఏం చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Lost Luggage Airport India

ప్రయాణాల్లో లగేజీ పోగొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అయితే, భారతీయ ఎయిర్‌‌పోర్టుల్లో ఇలా లగేజీ పోతే మాత్రం ప్రయాణికుల ముందు పలు మార్గాలు ఉన్నాయి. లగేజీని తిరిగి రాబట్టుకొనేందుకు వీలుగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటిని తూచా తప్పకుండా ఫాలో అయితే పోగొట్టుకున్న సామాన్లు తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయి.

ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయాల్లో మర్చిపోయిన వస్తువుల జాబితా ఏఏఐ వద్ద ఉంటుంది. సంస్థ వెబ్‌సైట్‌లోని లాస్ట్ అండ్ ఫౌండ్ సెక్షన్‌లో ఈ జాబితాను చెక్ చేయాలి. మీరు లగేజీని మర్చిపోయిన సమయం, విమానాశ్రయంలో ఎక్కడ మర్చిపోయారు అనే అంశాల ఆధారంగా వస్తువుల గురించి ఈ జాబితాలో సెర్చ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువుల రంగు, ఐటమ్ టైమ్, బ్రాండ్ తదితర వివరాలు కూడా ఈ జాబితాలో ఉంటాయి. లిస్టులోని వస్తువేదైనా మీదే అని అనిపిస్తే దాని రిఫరెన్స్‌ నెంబర్ నోట్ చేసుకోవాలి. వస్తువులు క్లెయిమ్ చేసుకునేందుకుద ఇది అక్కరకు వస్తుంది.

వస్తువులు పోగొట్టుకున్న తరువాత వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయాలి. అప్పుడే అవి మళ్లీ దొరికే అవకాశాలు పెరుగుతాయి. వస్తువులు పోయి 24 గంటలు కాకపోతే ఎయిర్‌పోర్టు డ్యూటీ టర్మినల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఈ గడువు దాటితే మాత్రం ఎయిర్‌పోర్టులోని ఏఏఐకి చెందిన సెంట్రల్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలి.

పోయిన వస్తువులు తిరిగి క్లెయిమ్ చేసుకునే సమయాల్లో ఐడీ వివరాలు కీలకం. కాబట్టి ప్రయాణికులు ఇలాంటి సందర్భాల్లో తమ వెంట ఆధార్ కార్డు, లేదా పాస్‌పోర్టు తీసుకెళ్లాలి. బ్యాగేజీ ట్యాగ్, బోర్డింగ్ పాస్ కూడా అవసరమే. అడిగినప్పుడు ఆ వస్తువు గురించి అన్ని వివరాలు చెప్పగలిగేలా ఉండాలి. దీంతో, లగేజీ మీదేనని సులువుగా రుజువు చేసుకోవచ్చు.

ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను సాధారణంగా టర్మినల్ హోల్డింగ్ ఏరియాలోనే 24 గంటల వరకూ ఉంచుతారు. ఆ తరువాత వాటిని సెంట్రల్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఆఫీసుకు తరలిస్తారు. అక్కడ ఎయిర్‌పోర్టు నిబంధనల మేరకు మరికొంత కాలం పాటు భద్రత పరుస్తారు. ఎవరూ క్లెయిమ్ చేసుకోని వస్తువులను అంతిమంగా కస్టమ్స్ అధికారులకు, స్థానిక అధికారులకు, లేదా స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని అరుదైన సందర్భాల్లో అధికారిక ప్రోటోకాల్స్‌ ప్రకారం, వాటిని పారేస్తారు.

ఇవి కూడా చదవండి:

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

రైలు ప్రయాణమా.. మీ లగేజీ బరువు ఈ పరిమితి దాటితే..

మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 02:26 PM