Congo Church Attack: కాంగో చర్చిపై దాడి.. 34 మంది మృతి
ABN, Publish Date - Jul 28 , 2025 | 06:23 AM
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ అనుకూల తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు.
కిన్షాసా, జూలై 27: ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ అనుకూల తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. తూర్పు కాంగోలోని ఓ క్యాథలిక్ చర్చిలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కాల్పులకు తెగబడ్డారు. ఇస్లామిక్ స్టేట్ మద్దతు గల అలైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ఏడీఎ్‌ఫ)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు చర్చి లోపల, వెలుపల విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. చర్చి ఆవరణలోని పలు ఇళ్లు, దుకాణాలను దహనం చేశారు. ఈ దాడుల్లో 34 మంది వరకు చనిపోయారని ఓ సామాజిక కార్యకర్త మీడియాకు వెల్లడించారు.
Updated Date - Jul 28 , 2025 | 06:23 AM