ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Peace Plan for Gaza Conflict: గాజా నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలి

ABN, Publish Date - Sep 28 , 2025 | 01:01 AM

గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు, భవిష్యత్తులో ఒక దేశంగా పాలస్తీనా ఏర్పాటయ్యేందుకు వీలుగా అమెరికా 21 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది....

  • హమాస్‌ ఆయుధాలను వీడాలి

  • అమెరికా 21 సూత్రాల శాంతి ప్రణాళిక

వాషింగ్టన్‌, సెప్టెంబరు 27: గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు, భవిష్యత్తులో ఒక దేశంగా పాలస్తీనా ఏర్పాటయ్యేందుకు వీలుగా అమెరికా 21 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. గాజా నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగడం, పాలస్తీనియన్లను గాజాలో ఉండేందుకు ప్రోత్సహించడం, హమాస్‌ ఆయుధాలు వీడడం, బందీలను విడుదల చేయడం, వంటి అంశాలు ఆ ప్రణాళికలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా అమెరికా ఈ ప్రణాళికను కొన్ని అరబ్‌, ముస్లిం దేశాల ముందు ఉంచింది. పాలస్తీనియన్లను గాజా స్ట్రిప్‌లో ఉండనివ్వాలనే ప్రతిపాదన.. ట్రంప్‌ వైఖరిలో మార్పును సూచిస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. గాజాను స్వాధీనం చేసుకుని.. పాలస్తీనియన్లను తరలిస్తానని ఫిబ్రవరిలో ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ‘ద్వి దేశ పరిష్కారా’న్ని ఎప్పుడూ సమర్థించని ట్రంప్‌.. భవిష్యత్తులో పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడేందుకు ఆలోచన చేయడం కూడా గమనార్హం. ఈ నేపథ్యంలో నెతన్యాహుతో సోమవారం జరగనున్న ట్రంప్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గాజాలోని జనావాసాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో కనీసం 44 మంది మరణించారు.

Updated Date - Sep 28 , 2025 | 01:01 AM