ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: అమెరికా హై పవర్ లేజర్ ఆయుధం.. పిక్ నెట్టింట వైరల్..

ABN, Publish Date - Feb 05 , 2025 | 01:13 PM

అమెరికా నేవీ ఇటివల హై పవర్డ్ లేజర్ ఆయుధం హెలియోస్‌ను పరీక్షించింది. అందుకు సంబంధించిన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కామెంట్లు కూడా వస్తున్నాయి.

HELIOS laser

అగ్రరాజ్యం అమెరికా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఇటివల డ్రోన్లు సహా ఇతర వ్యవస్థలను కాంతి వేగంతో ధ్వంసం చేసే అత్యధిక సామర్థ్యం ఉన్న HELIOS అనే లేజర్ ఆయుధాన్ని పరీక్షించారు. అమెరికా నావికాదళం ఇటీవల దీనిని ప్రదర్శించింది. దీంతో రక్షణ రంగంలో ఇది అతి పెద్ద కీలక మార్పు అని చెబుతున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో అనేక విప్లవాత్మక మార్పులు వస్తాయని అంటున్నారు. USS Preble అనే యుద్ధ నౌకలో పరీక్షించబడిన హేలియోస్ మానవరహిత వైమానిక వాహనాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది. ఈ క్రమంలో పెరుగుతున్న డ్రోన్ ముప్పు నుంచి సైనిక ఆస్తులను రక్షించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.


అత్యధిక సామర్థ్యంతో..

Lockheed Martin అనే కంపెనీ అభివృద్ధి చేసిన HELIOS వ్యవస్థలో 60 కిలోవాట్ల కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఈ లేజర్ ఐదు మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ధ్వంసం చేస్తుంది. దీని ద్వారా దాదాపు 60 ఇళ్లకుపైగా శక్తిని సరఫరా చేయవచ్చు. ఇది ఓడ నిరంతర శక్తి నుంచి పవర్‌ను పొందుతుంది, కాబట్టి నిల్వ అవసరం లేకుండా పనిచేస్తుంది. ఇది శుత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసి, లక్ష్యాలను భౌతికంగా నాశనం చేసే సామర్థ్యాన్ని కల్గి ఉంది.


సెన్సార్లను కూడా..

హేలియోస్ డ్రోన్లను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాకుండా, శత్రు నౌకల సెన్సార్లను కూడా అడ్డుకుంటుంది. దీంతోపాటు ఈ లేజర్ వ్యవస్థ ఓడ పోరాట వ్యవస్థలతో సమన్వయంగా పనిచేస్తూ లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యాన్ని కల్గి ఉంది. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడంతో భవిష్యత్తులో యుద్ధాల రూపం పూర్తిగా మారిపోనుందని నిపుణులు అంటున్నారు. US నావికాదళం ఈ HELIOS లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేసినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సాంకేతికతలు రానున్నాయని చెబుతున్నారు.


పలువురి కామెంట్లు

ఈ వ్యవస్థ పరీక్ష విజయవంతం కావడంతో దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో HELIOS హై పవర్ లేజర్ చిత్రం.. డ్రోన్లను కాల్చివేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ విషయం తెలిసిన అనేక మంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం మాకు హై పవర్ శక్తి వచ్చిందని, ఇకపై ఏ దేశాలకు భయపడమని పేర్కొన్నారు. మరి కొంతమంది ఈ సాంకేతికతను చూపిస్తూ మాకు కార్టూన్ సినిమాల్లో ఎప్పుడో ఈ టెక్నాలజీ వచ్చిందని చమత్కరించారు. అందుకు సంబంధించిన మీమ్స్ కూడా చేశారు.


ఇవి కూడా చదవండి:

Shooting: పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 05 , 2025 | 01:14 PM