India US Relations: భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించండి
ABN, Publish Date - Oct 09 , 2025 | 02:44 AM
అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌పై ఎడాపెడా సుంకాలను బాదడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం పడిన నేపథ్యంలో అమెరికా చట్టసభ్యులు కొందరు...
డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా చట్టసభ్యుల వినతి
వాషింగ్టన్, అక్టోబరు 8: అగ్రరాజ్యం అమెరికా.. భారత్‌పై ఎడాపెడా సుంకాలను బాదడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం పడిన నేపథ్యంలో అమెరికా చట్టసభ్యులు కొందరు అధ్యక్షుడు ట్రంప్‌నకు ఓ లేఖ రాశారు. భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించాలని అందులో కోరారు. సుంకాల విధింపు చైనా, రష్యాలకు భారత్‌ను దగ్గర చేసినట్టు పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన 19 మంది చట్టసభ్యుల్లో ఇండియన్-అమెరికన్ సభ్యులు కూడా ఉన్నారు. ఇటీవల ‘మీ యంత్రాంగం తీసుకున్న చర్యలతో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇరు దేశాలకు ప్రతికూల పరిణామాలను సృష్టిస్తున్నాయి’ అని తెలిపారు. ఇదే సమయంలో ఈ చర్యలు అమెరికాకు వ్యతిరేకమైన చైనా, రష్యాలతో భారత్ దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంచుకునేలా చేశాయన్నారు.
Updated Date - Oct 09 , 2025 | 02:45 AM