ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Diwali Celebrations: అమెరికాలో దీపావళి వేడుకలు.. సెలవులిచ్చిన రాష్ట్రాలు ఇవే

ABN, Publish Date - Oct 20 , 2025 | 08:16 PM

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు. మరీ లక్ష్మీ పూజ ఎప్పుడో, ఏయే రాష్ట్రాల్లో సెలవులు ఇచ్చారో ఈ కథనంలో తెలుసుకుందాం.

Diwali Celebrations in USA

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సంబరం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయులు కూడా ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే, పెద్ద దేశమైన అమెరికాలో ఆయా ప్రాంతాలు అనుసరించే కాలమానాలను బట్టి వేడుక నిర్వహిస్తారు (US Diwali Celebrations).

అమావాస్య తిథిలో దీపావళిని జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఈసారి తీథి అక్టోబర్ 21 ఉదయం వరకూ ఉంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో లక్ష్మీ పూజను అక్టోబర్ 20న సాయంత్రం 7.17 గంటల నుంచి 8.45 గంటల వరకూ నిర్వహించనున్నారు (Lakshimi Puja - Holiday).

ఇక పసిఫిక్ కోస్ట్ టైమ్ జోన్‌లోని వారు రాత్రి 7.38 నుంచి 9.01 మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. మౌన్‌టెయిన్ టైమ్‌ జోన్‌లో సాయంత్రం 4.40 నుంచి 6.41 గంటల మధ్య నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాలు దీపావళిని అధికారికంగా గుర్తించాయి. కొన్ని రాష్ట్రాలు దీపావళి నాడు జీతంతో కూడిన సెలవులను ఉద్యోగులకు మంజూరు చేశాయి. స్కూళ్లకు సెలవులిచ్చేందుకు అనుమతి ఉంది.

పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ రాష్ట్రాల్లో దీపావళిని అధికారిక సెలవుగా గుర్తించారు. ఈ జాబితాలో తాజాగా కాలిఫోర్నియా కూడా వచ్చి చేరింది. వచ్చే ఏడాది ఒకటి నుంచి అక్కడ దీపావళిని పండుగ సెలవుగా గుర్తించనున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై గవర్నర్ గెవిన్ న్యూసమ్ అక్టోబర్ 6న సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం స్కూళ్లకు సెలవులు ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది.

గతేడాది పెన్సిల్వేనియా ప్రభుత్వం దీపావళి పండుగను రాష్ట్ర సెలవుగా ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లోని స్కూళ్లకు దీపావళి నాడు సెలవు ఇచ్చేందుకు అనుమతిస్తూ గతేడాది టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2023లో న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు దీపావళి నాడు స్కూళ్లకు సెలవు ఇచ్చేందుకు అనుమతించాయి.

ఇవి కూడా చదవండి:

అఫ్ఘానిస్థానీలు మా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందే: పాక్ రక్షణ శాఖ మంత్రి

ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. అత్యంత విలువైన నగలతో దొంగలు పరార్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 20 , 2025 | 08:30 PM