Fast Foods: ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటే అకాల మృత్యువే.. జాగ్రత్త
ABN, Publish Date - May 01 , 2025 | 06:44 PM
మోడరన్ ఫుడ్ హేబిట్స్ అర్థాంతరంగా కొంపలు ముంచేటట్టు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినకండి మొర్రో అని పిల్లల్ని, యువకుల్ని ఎంత వారించినా ఆగడంలేదు.
Ultra processed food: మోడరన్ ఫుడ్ హేబిట్స్ అర్థాంతరంగా కొంపలు ముంచేటట్టు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ తినకండి మొర్రో అని పిల్లల్ని, యువకుల్ని ఎంత వారించినా ఆగడంలేదు. సాంప్రదాయ తిండ్లు, భోజనాలు పక్కన పెట్టేసి బర్గర్లు, చిప్స్, చికెన్ లాలీపాప్స్ ఇలా కొత్త తరహా రెడీమేడ్ లేదా జంక్ ఫుడ్స్ కు బాగా అలవాటు పడిపోతున్నారు నేటి తరం. అయితే, ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల అకాల మృత్యువు(సడన్ మరణాలు) సంభవిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు అకాల మరణాలకు కారణమవుతాయని ఆధారాలతో సహా చూపించింది.
ఎనిమిది దేశాల (ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, కొలంబియా, మెక్సికో, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్) నుండి ఆహార సర్వేలు, మరణాల డేటా నుండి డేటాను విశ్లేషించి అధ్యయనం చేసి ఈ నివేదిక తయారు చేశారు. సదరు డేటా ప్రకారం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు (UPFలు) తీసుకోవడం వల్ల అకాల మరణాలు చాలా ఎక్కువ సంభవిస్తున్నాయని సదరు అధ్యయనంలో తేలింది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాల అధిక వినియోగం 32 వేర్వేరు వ్యాధులతో ముడిపడి ఉందని కూడా ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఫాస్ట్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు(గుండె జబ్బులు), ఊబకాయం, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్, డిప్రెషన్ తో సహా 32 విభిన్న వ్యాధులు వచ్చే అవకాశం ఉందంట.
తీసుకునే ఆహారాలలో వస్తున్న మార్పులు, రెడీ మేడ్ ఫుడ్స్ లలో వాడే రంగులు, కృత్రిమ రుచులు, స్వీటెనర్లు, ఎమల్సిఫైయర్లు, అనేక ఇతర ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్ వల్ల మానవ శరీరానికి చాలా ముప్పు ఉంటుందని చెబుతున్నారు. కృత్రిమ పదార్ధాల వాడకం కారణంగా బాడీలో సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, చక్కెర స్థాయిలు బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎల్సెవియర్ ప్రచురణ సంస్థ ముద్రించిన, అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధ్యయనంలో దీనికి సంబంధించి సమగ్ర వివరాలు పొందుపరిచారు.
ఇవి కూడా చదవండి..
Woman Funny Video: కాళ్లను ఇలా ఎవరైనా కడుగుతారా.. ఈ యువతికి చివరికి ఏమైందో చూస్తే..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 01 , 2025 | 06:44 PM