Ukraine Drone Strikes: రష్యా గడ్డ మీది నుంచే రష్యాపై భీకర దాడులు
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:21 AM
ఉక్రెయిన్ ‘ఆపరేషన్ వెబ్’లో 41 రష్యా యుద్ధ విమానాలను డ్రోన్ దాడుల ద్వారా ధ్వంసం చేసింది. ప్రతిగా రష్యా ఉక్రెయిన్‌పై తీవ్ర దాడులు ప్రారంభించింది, యుద్ధం కొనసాగుతోంది.
ఎయిర్‌బే్‌సలే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం
41 రష్యన్ యుద్ధ విమానాల ధ్వంసం
4 వేల కిలోమీటర్ల దూరంలోని
సైబీరియాలోనూ లక్ష్యాలను ఛేదించిన డ్రోన్లు
ధ్వంసమైన విమానాల్లో టీయూ-22ఎం3, టీయూ-95 బాంబర్లు
ఏ-50 అవాక్స్‌పైనా విధ్వంసక దాడి
18 నెలలుగా వ్యూహాత్మక ఆపరేషన్
ట్రక్కుల్లో ఎఫ్‌పీవీ డ్రోన్లను పంపిన ఉక్రెయిన్
పార్క్ చేసిన ట్రక్కులు, ఇళ్లపైన మోహరింపు
రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసిన ఎస్‌బీయూ
ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకార దాడులు
12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతి
కీవ్, జూన్ 1: ఉక్రెయిన్‌ను వారంరోజుల్లో చుట్టేస్తామంటూ మూడేళ్ల క్రితం యుద్ధానికి దిగిన రష్యాకు ఆదివారం పెద్ద దెబ్బ తగిలింది. ఈ యుద్ధం 1,192వ రోజుకు చేరుకోగా.. ‘ఆపరేషన్ వెబ్’ పేరుతో రష్యా గడ్డ మీది నుంచే ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో రష్యాలోని నాలుగు ఎయిర్‌బే్‌సలు టార్గెట్ అయ్యాయి. 18 నెలలుగా ఆ ఆపరేషన్‌ను వ్యూహాత్మకంగా కొనసాగించి, ట్రక్కుల్లో రష్యాకు డ్రోన్లను పంపిన ఉక్రెయిన్.. ఆధునిక యుద్ధతంత్రంలో తనదైన ముద్రవేస్తూ రిమోట్ కంట్రోళ్లతో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 41 రష్యా యుద్ధ విమానాలను బుల్లి డ్రోన్లు(ఎ్‌ఫపీవీ కామికాజి) తుత్తునియలు చేశాయి. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 700 కిలోమీటర్లు మొదలు.. 4వేలకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉండే నాలుగు ఎయిర్‌బే్‌సలు బెలాయా, డియాగిలెవ్, ఒలేన్యా, ఇవానోవోపై ఆదివారం ఉదయం ఉక్రెయిన్ ముప్పేట దాడులు చేసింది. వీటిల్లో బెలాయా ఎయిర్‌బెస్ ఉక్రెయిన్ సరిహద్దులకు 4 వేలకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉండే ఇర్‌కుట్స్క్ రీజియన్‌లో ఉండడం గమనార్హం..! ‘‘రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణుల, డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు’’ అంటూ పాశ్చాత్య దేశాల నుంచి అనుమతి వచ్చిన వెంటనే.. రష్యా అవాక్కయ్యేలా ఉక్రెయిన్ క్షిపణులతో కాకుండా.. ఆ దేశ గడ్డ మీద నుంచే చిన్న డ్రోన్లతో దాడులు జరపడం గమనార్హం..! ఈ దాడులను ఉక్రెయిన్ అధికారిక వార్తాసంస్థ ‘ఉక్రిఇన్ఫాం’తోపాటు.. రష్యా వార్తా సంస్థ ఏఎ్‌ఫపీ, ఆర్టీ కూడా నిర్ధారించాయి. ఇర్‌కుట్స్క్ గవర్నర్ ఐగర్ కోబ్జెవ్‌తోపాటు.. రియాజన్, ముర్మన్స్క్ రీజియన్ల అధికారులు కూడా ఎయిర్‌బే్‌సలపై దాడులు జరిగిన విషయాన్ని అంగీకరించారు. పైన పేర్కొన్న ఎయిర్‌బే్‌సలలో.. డ్రోన్ దాడుల తర్వాత కాలిపోతున్న రష్యన్ యుద్ధ విమానాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ‘ఆపరేషన్ వెబ్’తో ఒక ఏ-50 (అవాక్స్) విమానం సహా.. టీయూ-22ఎం3, టీయూ-95 బాంబర్ విమానాలు.. మొత్తం 41 యుద్ధ విమానాలు బుగ్గిపాలయ్యాయి. బెలయా ఎయిర్‌ఫీల్డ్ పూర్తిగా ఆహుతైంది. ఒక్కో టీయూ-22ఎం3 బాంబర్ ధర రూ.2,505 కోట్లు, టీయూ-95 బాంబర్ ధర రూ.1,361 కోట్లుగా ఉంటుందని అంచనా. దీన్ని బట్టి.. ఉక్రెయిన్ దాడుల్లో రష్యాకు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. ఈ ఆపరేషన్‌ను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీ్‌స నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
రష్యా ప్రతీకార దాడులు..
ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రగిలిపోయిన రష్యా.. ఆదివారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పై 83 సార్లు వేర్వేరు దాడులు జరిపింది. ఖార్కివ్, కుపియాంక్, లైమన్, టోరెట్స్క్, క్రామాటోస్క్, పొక్రోవ్స్క్, నోవోపావ్లివ్కాల్లో మధ్యాహ్నం నుంచి పలు విడతలుగా డ్రోన్, క్షిపణి దాడులు జరిపింది. ఈ మూడేళ్ల యుద్ధంలో రష్యా ఒక్కరోజే 472 డ్రోన్లతో దాడి చేయడం ఇదే మొదటి సారి అని ఉక్రెయిన్ వైమానిక దళం చెప్పింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 300కు పైగా డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఖార్కివ్, ఫిహోల్కివ్కా ప్రాంతాల్లో ఉక్రెయిన్, రష్యా పదాతిదళాల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నట్లు జనరల్ స్టాఫ్ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి సుమారు అరగంట పాటు రాజధాని నగరం కీవ్‌లో సైరన్ల మోత వినిపించిందని, కుపియాంక్, స్టెపోవా, నోవోసెలివ్కా, నోవా క్రుగ్లియాకివ్కా ప్రాంతాల్లో క్షిపణి దాడులు జరిగినట్లు ‘ఉక్రిఇన్ఫాం’ వివరించింది. ఆదివారం ఉదయం రష్యా సరిహద్దులకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే సుమీ రీజియన్‌లోని ఒలెక్సివ్కాలోని ఉక్రెయిన్ గ్రౌండ్ ఫోర్సె్‌సపై దాడులు జరిగాయని పేర్కొంది. ఈ దాడుల్లో 12 మంది సైనికులు మృతిచెందగా.. మరో 60 మంది క్షతగాత్రులైనట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, సోమవారం ఇస్తాంబుల్‌లో జరగనున్న శాంతి చర్చల కోసం తమ ప్రతినిధులు వెళ్తారని ఉక్రెయిన్ అఽధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 06:17 AM