Chopped Off His Legs: ఇన్స్యూరెన్స్ సొమ్ముల కోసం రెండు కాళ్లు నరుక్కుని..
ABN, Publish Date - Jul 24 , 2025 | 09:10 PM
ఒక డాక్టర్ ఇన్స్యూరెన్స్ సొమ్ముల కోసం వింత పనికి పూనుకున్నాడు. సుమారు రూ. 5.4 కోట్లు బీమా సొమ్మల కోసం ఏకంగా తన రెండు కాళ్లు నరుక్కున్నాడు. అయితే, ఈ కేసులో లభించిన సాక్ష్యాలతో కోర్టు..
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌కు చెందిన నీల్ హాపర్(49) అనే డాక్టర్ (వాస్కులర్ సర్జన్) ఒక వింత పనికి పూనుకున్నాడు. 500,000 పౌండ్ల (సుమారు రూ. 5.4 కోట్లు) ఇన్సూరెన్స్ సొమ్ముల కోసం ఏకంగా తన రెండు కాళ్లు నరుక్కున్నాడు. ఈ మేరకు అతనిపై అక్కడి కోర్టులో కేసు నడుస్తోంది. అయితే, నీల్.. సెప్సిస్ కారణంగా కాళ్లు కోల్పోయినట్లు పేర్కొన్నాడు.
అయితే, కోర్టు సాక్ష్యాల ప్రకారం, నీల్ ఒక ఇన్సూరెన్స్ సంస్థ అరివా గ్రూప్ నుండి 235,622 పౌండ్లు, మరొక సంస్థ ఓల్డ్ మ్యూచువల్ నుండి 231,031 పౌండ్లు బీమా క్లెయిమ్ గా పొందాలని ఆశించాడు. ఈ క్రమంలో అతను 'ది యూనక్ మేకర్' అనే వెబ్‌సైట్ నుండి అవయవ తొలగింపు వీడియోలను కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది. అంతేకాదు, ఇలాంటి పనులు చేసే మారియస్ గుస్తావ్‌సన్‌ను తన కాళ్లు తొలగించమని ప్రోత్సహించినట్లు కూడా సాక్ష్యాలు ఉన్నాయి.
హాపర్ 2013 నుండి రాయల్ కార్న్‌వాల్ హాస్పిటల్స్ NHS ట్రస్ట్‌లో పనిచేస్తున్నాడు. అయితే, 2023 మార్చిలో అతని అరెస్టు తర్వాత విధుల నుండి సస్పెండ్ చేశారు. ఇలా ఉంటే, నీల్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా వింతైన సమాధానాలిచ్చాడు. తాను చాలా అవయవ తొలగింపు శస్త్రచికిత్సలు చేశానని, తానెప్పుడూ పవర్ టూల్స్ గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పాడు. అయతే, తాను చాలా త్వరగా కోలుకున్నానని, మూడు నెలల్లో నడవగలనని చెప్పినప్పటికీ, తాను మూడు గంటల్లోనే నడిచానని చెప్పాడు. అంతేనా, తాను కాళ్లు కోల్పోయిన తర్వాత మునుపటి కంటే ఎక్కువ చురుకుగా ఉన్నానని కూడా సెలవిచ్చాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 24 , 2025 | 09:10 PM