U S Government Enters Shutdown: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్
ABN, Publish Date - Oct 02 , 2025 | 03:17 AM
అమెరికా కాంగ్రె్‌సలో అధికార పక్షం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌కు.. తాము ప్రతిపాదించిన మార్పులు చేయకపోవడంతో....
2018 తర్వాత ఇదే మొదటిసారి
వాషింగ్టన్, అక్టోబరు 1: అమెరికా కాంగ్రె్‌సలో అధికార పక్షం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌కు.. తాము ప్రతిపాదించిన మార్పులు చేయకపోవడంతో డెమొక్రాట్లు ఆ బిల్లును బ్లాక్ చేశారు. దీనివల్ల నిధులు నిలిచిపోవడంతో అమెరికాలో అత్యవసర సేవలు మినహా మిగతా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి (షట్‌డౌన్) స్తంభించిపోయాయి. 2018 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. అప్పుడూ ట్రంపే అధికారంలో ఉన్నారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టడానికి ట్రంప్ సర్కారు అడిగిన నిధులివ్వడానికి డెమొక్రాట్లు ఒప్పుకోకపోవడంతో 2018 డిసెంబరు 22న షట్‌డౌన్ మొదలైంది. చివరకు అది 2019 జనవరి 25న ముగిసింది. ఇప్పుడు కూడా ట్రంప్ సర్కారు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం లభించేదాకా ఈ షట్‌డౌన్ కొనసాగుతుంది. అప్పటిదాకా సైన్యం, పోలీసు, వైద్యం, విమాన రవాణా తదితర అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి. అత్యవసరం కాని.. జాతీయ పార్కులు, మ్యూజియాలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసేస్తారు. షట్‌డౌన్ సాగినన్నాళ్లూ వాటిలోని ఉద్యోగులు కార్యాలయానికి రానక్కర్లేదు. ఈ సమయంలో పనిచేసినవారికి సైతం బడ్జెట్‌కు ఆమోదం లేకపోవడంతో వెంటనే జీతాలు ఇవ్వరు. బడ్జెట్‌కు ఆమోదం లభించిన తర్వాత మాత్రమే ఆ కాలానికి జీతం ఇస్తారు.
Updated Date - Oct 02 , 2025 | 03:17 AM