Trump NASA Decision: నాసా చీఫ్ ఎంపికలో ట్రంప్ యూటర్న్
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:10 AM
నాసా చీఫ్‌గా జేర్డ్ ఐజాక్‌మన్‌ను నామినేట్ చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నూతన నామినీని త్వరలో ప్రకటిస్తానని వెల్లడించిన ట్రంప్ నిర్ణయంపై ఎలాన్ మస్క్ ప్రశంసలు గుప్పించారు.
మస్క్ సహచరుడి నియామక నిర్ణయం ఉపసంహరణ
వాషింగ్టన్, జూన్ 1: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చీఫ్ పదవికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వ్యాపార సహచరుడు, బిలియనీర్, ప్రైవేట్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్‌మన్‌ను నామినేట్ చేస్తూ తాను గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్ల్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గతంలో ఐజాక్‌మన్‌కు ఇతర సంస్థలతో ఉన్న సంబంధాలను సమగ్రంగా సమీక్షించిన తరువాత తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. త్వరలోనే నూతన నామినీని ప్రకటిస్తానని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయంపై ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నాసాకు నాయకత్వం వహించడానికి ఐజాక్‌మన్ వంటి సమర్థుడు, మంచివాడు దొరకడం చాలా అరుదు’’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 05:10 AM