ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump China trade war: చైనాను ఒంటరిని చేద్దాం

ABN, Publish Date - Apr 17 , 2025 | 04:11 AM

చైనాతో వాణిజ్య యుద్ధంలో ట్రంప్‌ మరింత కఠినంగా వ్యవహరిస్తూ 245 శాతం వరకు సుంకాలు విధించారు. చైనా ఉత్పత్తులపై ప్రత్యేకంగా అధిక సుంకాలు వేసి ఒత్తిడి పెంచాలని అమెరికా యత్నిస్తోంది.

డ్రాగన్‌ కట్టడికి సుంకాల చర్చలను

ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్‌

చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి

ఇవ్వొద్దని పలు దేశాలకు సూచన!

చైనాతో వాణిజ్యం తగ్గించాలని ఒత్తిడి

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం

చైనా ఉత్పత్తులపై అమెరికా

సుంకాల భారం 245 శాతానికి?

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 16: వాణిజ్య, సుంకాల యుద్ధంలో తమతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తూ తలనొప్పిగా మారిన చైనాను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యోచిస్తున్నారు! సుంకాలకు సంబంధించి ఇతర దేశాలు తమతో చర్చలకు వచ్చినప్పుడు.. చైనాతో వాణిజ్య కార్యకలాపాలను తగ్గించుకోవాలని వాటిపై ఒత్తిడి తేవడం ద్వారా డ్రాగన్‌ దేశాన్ని ఒంటరిని చేసేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొంటూ అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రతీకార సుంకాల బారి నుంచి తప్పించుకోవాలంటే.. తమ తమ దేశాల గుండా చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతులు నిరాకరించాలని, చైనా కంపెనీలు తమ భూభాగంలో లేకుండా చూడాలని అడిగేందుకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమైనట్టు అందులో పేర్కొంది. అందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే చైనా ఆర్థికంగా దెబ్బతింటుంది.

పైగా.. తమతో చర్చలకు సిద్ధమైనప్పుడు డ్రాగన్‌ దేశానికి పెద్దగా డిమాండ్లు చేసే అవకాశం ఉండదని అమెరికా భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే అమెరికా దీనిపై కొన్ని దేశాలతో చర్చించినట్టు కూడా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.


గంపగుత్తగా కాదు..

సుంకాల విషయంలో తనతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్న చైనాపై ప్రతీకార సుంకాన్ని అమెరికా నిశ్శబ్దంగా 245 శాతానికి పెంచేసిందా? శ్వేతసౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్‌ షీట్‌ ప్రకారం చైనా ఉత్పత్తులపై సుంకాల భారాన్ని అమెరికా ఏకంగా 145ు నుంచి 245 శాతానికి.. అంటే ఏకంగా మరో 100 శాతం మేర పెంచేసినట్టు. అయితే, వైట్‌హౌస్‌ ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్న 245 శాతం మాట నిజమేగానీ.. అది చైనా నుంచి అమెరికా చేసుకునే అన్ని ఉత్పత్తులపైనా గంపగుత్తగా వేసే భారం కాదు. ఆ విషయం ఫ్యాక్ట్‌ షీట్‌లోనే స్పష్టంగా ఉంది. 125 శాతం ప్రతీకార సుంకం, 20ు ఫెంటైనిల్‌ సుంకంతోపాటు.. కొన్ని వస్తువులపై 7.5 శాతం నుంచి 100 శాతం దాకా అదనంగా సుంకాలు ఉన్నట్టు అందులో పేర్కొంది. ఉదాహరణకు.. చైనా నుంచి దిగుమతి చేసుకునే సిరంజిలు, సూదులపై అత్యధికంగా 245 శాతం సుంకాలున్నాయి. 2024లో జో బైడెన్‌ హయాంలో వాటిపై 100 శాతం సుంకాలు విధించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక 20ు ఫెంటైనిల్‌ సుంకాలు వేశారు. తర్వాత.. ఏప్రిల్‌ 2న ప్రపంచ దేశాలన్నింటిపైనా విధించిన ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 34 శాతం విధించారు. దానికి చైనా దీటుగా స్పందించి తానూ ప్రతీకార సుంకాన్ని విధించడంతో.. ఆ సుంకాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ 125 శాతానికి తీసుకెళ్లారు. అది 125 శాతం, ఫెంటైనిల్‌ సుంకం 20 శాతం కలిపితే.. 145 శాతం అయ్యింది. సిరంజిలు, సూదులపై బైడెన్‌ హయాంలో విధించిన 100 శాతాన్ని కూడా కలుపుకొంటే వాటిపై భారం 245 శాతానికి చేరింది. అలాగే.. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఊలు స్వెటర్లపై అమెరికా సుంకాల భారం ప్రస్తుతం 168.5 శాతంగా ఉంది. ఇలా ఉత్పత్తిని బట్టి సుంకాల్లో తేడా ఉంటుంది. కాగా.. వైట్‌హౌస్‌ ఫ్యాక్ట్‌ షీట్‌లో పేర్కొన్న 245 శాతం సుంకాల గురించి చైనా విదేశాంగ మంత్రిని మీడియా ప్రశ్నించగా.. పన్ను రేట్ల గురించి అమెరికానే అడగాలని ఆయన సూచించారు. సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరని మరోసారి తేల్చిచెప్పారు. చైనా ఇలాంటి వాటికి భయపడదని తేల్చిచెప్పారు.


మేం సిద్ధమే కానీ..

తాను విధించిన ప్రతీకార సుంకాల దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ తమతో చర్చలు జరిపి, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తహతహలాడుతున్నాయని పదేపదే చెబుతున్న ట్రంప్‌కు.. చైనా ప్రతీకార చర్యల సెగ బాగానే తగులుతున్నట్టు కనిపిస్తోంది. అలాగని చైనాతో చర్చల కోసం తామే ముందడుగు వేయాలంటే అహం అడ్డొస్తోంది. దీంతో.. ‘కిందపడ్డా నాదే పైచేయి’ అనే సామెత చందంగా అగ్రరాజ్యం వ్యవహరిస్తోంది. ‘‘చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్‌ సిద్ధంగానే ఉన్నారు. కానీ.. చర్చల దిశగా మొదటి అడుగు బీజింగే వెయ్యాలి’’ అంటూ వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కారొలిన్‌ లీవిట్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘ఇప్పుడు బంతి చైనా కోర్టులో ఉంది. ఆ దేశమే మాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఆ దేశంతో మేము ఏ ఒప్పందాలూ చేసుకోనవసరం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. చైనాతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్‌ తనతో స్వయంగా తెలిపినట్టు ఆమె వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 17 , 2025 | 04:12 AM