ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Import Duties: పచ్చళ్లపైనా ట్రంప్‌ సుంకం

ABN, Publish Date - May 04 , 2025 | 05:07 AM

ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తిగతంగా భారత్‌ నుంచి తెప్పించుకునే చిన్నచిన్న ఉత్పత్తులపై కూడా సుంకాలు విధించేందుకు నిఘా పెడుతోంది. సోషల్‌ మీడియా లేదా బంధుమిత్రుల ద్వారా వస్తువులు తెప్పించుకునే భారతీయులపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశంతో ముందడుగు వేసింది.

భారత్‌ నుంచి తెప్పించుకునే ఆహారోత్పత్తులపై నిఘా

పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు

సోషల్‌ మీడియా, యాప్‌ల ద్వారా

అమెరికాలో పలువురు భారతీయుల చిరువ్యాపారాలు

ఇంతకాలం సుంకాలు లేకుండానే.. ఇకపై పన్నుపోటు

అమెరికాకు బంధువులు తీసుకొచ్చే వాటిపైనా ఆంక్షలు!

ఆందోళనలో భారతీయులు.. వాట్సాప్‌ గ్రూపుల్లో చర్చ

బ్బు వసూలు చేసే ఏ చిన్న అవకాశాన్ని, మార్గాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వదిలిపెట్టటం లేదు. ఆఖరికి, భారత్‌ నుంచి పచ్చళ్లు వంటి వాటిని తెచ్చుకుంటే వాటి మీద కూడా సుంకాలు విధించటానికి సన్నద్ధమవుతున్నారు. ఇండియా నుంచి ఎవరైనా స్నేహితులో, బంధువులో అమెరికా వస్తుంటే ఫలానా వస్తువులు కొని తీసుకురావాల్సిందిగా అమెరికాలో ఉన్న భారతీయులు పురమాయిస్తుంటారు. వ్యక్తిగత స్థాయిలో ఈ విధంగా తెప్పించుకునే ఉత్పత్తుల మీద అమెరికా ప్రభుత్వానికి సుంకాలు చెల్లించడం వంటిదేమీ ఇప్పటి వరకూ లేదు. దశాబ్దాలుగా ఇలాగే నడుస్తోంది. కానీ, ట్రంప్‌ 2.0లో అన్నీ తారుమారవుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలపై కూడా అమెరికా ప్రభుత్వం తాజాగా దృష్టి సారిస్తోంది. వ్యక్తుల ద్వారా, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇక మీదట నిఘా పెట్టనున్నారు. వీటి మీద కూడా సుంకం వసూలు చేసి ఖజానా నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుంకం చెల్లించకపోతే, భారీ జరిమానాలు విధించి ఇలాంటి మార్గాలను పూర్తిగా కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

భారత్‌లో మాదిరిగానే అమెరికాలో కూడా.. సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌నే వ్యాపార వేదికలుగా మార్చుకుని అనేకమంది విక్రయాలు జరుపుతున్నారు. వీరిలో పలువురు తెలుగువాళ్లు, ఇతర రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇండియా నుంచి వివిధ ఉత్పత్తులను కొరియర్‌ ద్వారా తెప్పించుకొని..


సోషల్‌ మీడియాలో ఆర్డర్లు తీసుకొని కొనుగోలుదార్లకు కొరియర్‌ ద్వారా పంపిస్తున్నారు. వీరు సాధారణంగా పన్నులు చెల్లించడం అంటూ ఉండదు. ఇంకొందరు యాప్‌ల ద్వారా కూడా ఈ తరహా వ్యాపారాలు చేస్తున్నారు. భారత్‌ నుంచి ఏమైనా ఉత్పత్తులను, వస్తువులను తెప్పించుకోవాలనుకున్న వాళ్లు ఈ యాప్‌లలో రిజిస్టర్‌ చేసుకుంటారు. యాప్‌ నిర్వాహకులు ఇండియాలో వాటిని కొనుగోలు చేసి కొరియర్‌ ద్వారా తెప్పించి అందజేస్తారు. ఈ తరహా వ్యాపారంలో కూడా యూఎస్‌ ప్రభుత్వానికి పన్ను చెల్లించడం జరగదు. వీరందరి మీద ఇప్పుడు ట్రంప్‌ సర్కారు నజర్‌ పడింది. విక్రయించేవారితోపాటు కొనుగోలుదార్ల మీద కూడా సుంకాలు విధించాలని భావిస్తున్నారు. దీంట్లో భాగంగా, భారత్‌లోని రిటైలర్ల నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తులు తెప్పించుకుంటున్న షిప్మెంట్లను అధికార వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు పలువురికి భారీ జరిమానాలు, న్యాయపరమైన చర్యలకు సంబంధించి నోటీసులు పంపుతున్నాయి. ఇదంతా చిరువ్యాపారాలు చేస్తున్న వారికి సంబంధించి కాగా, వ్యక్తిగతస్థాయిలో బంధుమిత్రులు అమెరికాకు వస్తుంటే వారి ద్వారా పచ్చళ్లు, తినుబండారాలు, దుస్తులు, బంగారు నగలు వంటివి తెప్పించుకుంటే ఏమిటి పరిస్థితి అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Updated Date - May 04 , 2025 | 06:57 AM