Trump: అమెరికాలో ఫోన్లను తయారు చేయకుంటే సామ్‌సంగ్‌పైనా దిగుమతి సుంకం
ABN, Publish Date - May 25 , 2025 | 04:10 AM
అమెరికాలో అమ్మే ఫోన్లను అక్కడే తయారు చేయాలంటూ ట్రంప్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నారు. తయారీ చేయకపోతే 25% దిగుమతి సుంకం విధిస్తామని యాపిల్, సామ్‌సంగ్ వంటి సంస్థలను హెచ్చరించారు.
న్యూయార్క్/వాషింగ్టన్, మే 24: అమెరికాలో విక్రయించే ఫోన్లను అమెరికాలోనే తయారు చేసే విధంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆయా కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో అమ్మే ఐఫోన్లను ఇక్కడే తయారు చేయకుంటే వాటిపై 25ు దిగుమతి సుంకం విధిస్తామని ఆయన యాపిల్ కంపెనీని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదేవిధంగా సామ్‌సంగ్‌ను కూడా హెచ్చరించారు. అమెరికాలో తన ఫోన్లను తయారు చేయకుంటే సామ్‌సంగ్ కూడా 25% దిగుమతి సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో డివైజ్‌లను విక్రయించే ఏ ఫోన్ తయారీ కంపెనీకైనా సుంకం వర్తిస్తుందని ఆయన వైట్ హౌస్‌లో విలేకరులతో అన్నారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..
Updated Date - May 25 , 2025 | 04:10 AM