Trump offer: డబ్బులిస్తాం.. విమానం టికెట్ ఇస్తాం.. వెళ్లిపోండి!
ABN, Publish Date - Apr 17 , 2025 | 04:23 AM
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు ట్రంప్ కొత్త ఆఫర్‌ను ప్రకటించారు. స్వదేశానికి వెళ్లేందుకు వారికి డబ్బు, విమానం టికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్రమ వలసదారుల సంఖ్యలో భారతీయులు ఐదో స్థానంలో ఉన్నారు, ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.
అక్రమ వలసదారులకు అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్
వాషింగ్టన్, ఏప్రిల్ 16: అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు దేశాధ్యక్షుడు ట్రంప్ సరికొత్త ఆఫర్ ప్రకటించారు. స్వీయ బహిష్కరణను ఎంచుకొనేవారు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి కొంత మొత్తం డబ్బులతో పాటు విమానం టికెట్ కూడా ఇస్తామని తెలిపారు. భవిష్యత్తులో వారిలో కొందరిని అమెరికాలోకి చట్టబద్ధంగా అనుమతించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. ‘‘మేం వారికి కొంత డబ్బు, విమానం టికెట్ ఇవ్వబోతున్నాం. వారికి తగిన నైపుణ్యం ఉంటే... ఆ తర్వాత వారితో కలిసి పనిచేయబోతున్నాం. వారిని వీలైనంత త్వరగా వెనక్కి రప్పించుకుంటాం’ అని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు దృష్టిసారించారని, అయితే ఇతరులు మాత్రం సౌకర్యవంతంగా వెళ్లిపోయేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. కాగా, ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం 2022లో సరైన పత్రాలు లేకుండా అమెరికాలో 7,25,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. అక్రమ వలసదారుల జాబితాలో మెక్సికన్లు, సాల్వడోరియన్ల తర్వాత మనోళ్లే అత్యధికం. మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అంచనాల ప్రకారం 3,75,00 మందితో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్
BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ
Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు
Updated Date - Apr 17 , 2025 | 04:23 AM