ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gaza Peace Plan: గాజాలో శాంతి వైపు అడుగులు!

ABN, Publish Date - Oct 05 , 2025 | 03:46 AM

గాజాలో శాంతి స్థాపన వైపు అడుగులు పడుతున్నాయి. శాంతి ఒప్పందానికి ముందుకు రావాలని, లేకుంటే నరకం చూపిస్తామన్న అమెరికా అధ్యక్షుడు...

  • ట్రంప్‌ శాంతి ప్రణాళికను కొన్ని షరతులతో అంగీకరించిన హమాస్‌.. బందీల అప్పగింతకు సిద్ధమని ప్రకటన

  • గాజాలో దాడులు వెంటనే ఆపాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ సూచన

దేర్‌ అల్‌ బలా (గాజా), అక్టోబరు 4: గాజాలో శాంతి స్థాపన వైపు అడుగులు పడుతున్నాయి. శాంతి ఒప్పందానికి ముందుకు రావాలని, లేకుంటే నరకం చూపిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలతో హమాస్‌ కాస్త దిగొచ్చింది. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో బందీల విడుదల సహా కొన్ని అంశాలకు అంగీకారం తెలిపింది. దీనిపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. శాశ్వత శాంతికి వారు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నానని ‘ట్రూత్‌’ సోషల్‌లో పోస్టు పెట్టారు. గాజాలో బాంబుదాడులను వెంటనే ఆపేయాలని, అలాగైతేనే బందీలను సురక్షితంగా, వేగంగా విడుదల చేయించుకోగలమని ఇజ్రాయెల్‌కు సూచించారు. ట్రంప్‌ స్పందనపై హమాస్‌ హర్షం వ్యక్తం చేసింది. ‘‘ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ సూచనలు శాంతికి మార్గం వేసేలా ఉన్నాయి. బందీల పరస్పర మార్పిడి, గాజా నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం ఉప సంహరణ, యుద్ధం ముగింపుపై వెంటనే చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని హమాస్‌ రాజకీయ విభాగం మీడియా సలహాదారు తాహిర్‌ అల్‌ నౌనూ ప్రకటించారు. ఇక ట్రంప్‌ శాంతి ప్రణాళిక ప్రకారం మొదటి దశ అమలు కోసం తాము సిద్ధమవుతున్నట్టు ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. కానీ ఉన్నట్టుండి గాజా సిటీ, ఖాన్‌ యూని్‌సలోని పలు ప్రాంతాలపై వైమానిక, డ్రోన్‌ దాడులు చేసింది. ఇందులో ఆరుగురు పౌరులు మృతి చెందారు. మరోవైపు, గాజాలో శాంతి కోసం ట్రంప్‌ నాయకత్వంలో నిర్ణయాత్మక ముందడుగు పడిందని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో ప్రశంసించారు. బందీల విడుదలకు హమాస్‌ అంగీకరించడం శాంతి స్థాపనలో కీలక పరిణామమన్నారు. కాగా, శాంతి ప్రణాళికపై హమాస్‌ వేగంగా చర్యలు చేపట్టాలని, ఏమాత్రం ఆలస్యమైనా దారుణ పరి స్థితులు తప్పవని ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు.

హమాస్‌ చేస్తున్న డిమాండ్లు ఏమిటి?

గాజా రాజకీయ భవిష్యత్తు, పాలస్తీనా హక్కులపై పూర్తి స్పష్టత రావాలని.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని హమాస్‌ కోరుతోంది. గాజా నుంచి ఇజ్రాయెల్‌ దళాలు సంపూర్ణంగా తొలగిపోవాలని డిమాండ్‌ చేస్తోంది. గాజా పరిపాలనను నిపుణులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధమని.. అయితే అమెరికా చెప్పినట్టుగా కాకుండా అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలు, పాలస్తీనావాసుల ఉమ్మడి అంగీకారంతో ఈ ఏర్పాటు జరగాలని కోరుతోంది. అయితే 20సూత్రాల ప్రణాళికలో కీలకమైన ఆయుధాలు వదిలేయాలన్న అంశంపై హమాస్‌ ఎలాంటి స్పందన వెల్లడించలేదు. హమాస్‌ ఇంకా 48 మంది బందీలను అప్పగించాల్సి ఉంది. అందులో 20 మందే జీవించి ఉన్నట్టు అంచనా. మరోవైపు ఇజ్రాయెల్‌ వద్ద బందీలుగా ఉన్న సుమారు 250 మంది పాలస్తీనీయులను విడుదల చేసే అవకాశం ఉంది.

శాంతికి అడ్డంకులు మరెన్నో..

ట్రంప్‌ 20 సూత్రాల శాంతి ప్రణాళికలో పాలస్తీనా దేశం ఏర్పాటు అంశం కూడా ఉంది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ దీనికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఒప్పందంలో ఈ అంశం లేదని, పాలస్తీనా దేశం ఏర్పాటుకు తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మరోవైపు ఆయుధాలు వదిలేసేందుకు హమాస్‌ సిద్ధంగా లేదు. ప్రస్తుతం పాలనను స్వతంత్ర పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధమని హమాస్‌ చెప్పినా.. అధికారంలో భాగస్వామ్యం కావొద్దన్న నిబంధననూ అంగీకరించడం లేదు. అంతేకాదు కీలక మధ్యవర్తులైన ఈజిప్ట్‌, ఖతార్‌ మాత్రం ట్రంప్‌ 20సూత్రాల ప్రణాళికలోని కొన్ని అంశాలపై లోతుగా చర్చించి, స్పష్టతకు రావాల్సి ఉందని ప్రకటించాయి.

Updated Date - Oct 05 , 2025 | 03:46 AM